జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు పొందిన అదిరే అభి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కి ముందు ఎన్నో సినిమాలలో నటించిన అభి జబర్దస్త్ లో అవకాశం రావడంతో అక్కడ తన స్కిట్లతో బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తూ వారికి బాగా దగ్గరయ్యాడు. ఇలా అభికి సినిమాల కంటే జబర్దస్త్ ద్వారానే మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఇంతటి గుర్తింపునిచ్చిన జబర్దస్త్ కి కొంతకాలం క్రితం అభి దూరమయ్యాడు. రెమ్యూనరేషన్ విషయంలో మల్లెమాల వారితో వచ్చిన మనస్పర్ధలు కారణంగానే అభి జబర్దస్త్ కి దూరమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే అభి మాత్రం మల్లెమాల వారితో ఎటువంటి మనస్పర్ధలు లేవని వారితో సామరస్యంగా సంప్రదించిన తర్వాతనే జబర్దస్త్ కు దూరమయ్యానని వెల్లడించాడు. ఇదిలా ఉండగా జబర్దస్త్ కి దూరమైన కూడా అభి సినిమాలలో నటిస్తూ మరొకవైపు తన సాఫ్ట్వేర్ జాబ్ ని కొనసాగిస్తున్నాడు. ఇక ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో అభి పాల్గొని జబర్దస్త్ గురించి రోజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించారు. అందరిలాగా కొట్టుకునే స్కిట్లు, అభ్యంతర స్కిట్లు కాకుండా ప్రేక్షకులందరూ కుటుంబంతో కలిసి చూసే విధంగా ఉండేలా స్కిట్లు చేయడానికి ప్రయత్నించాను అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ క్రమంలో రోజా గారి గురించి మీ అభిప్రాయం ఏమిటి? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. “రోజా గారు ఒక ఎమ్మెల్యే గా, జడ్జ్ గా గొప్ప స్థానంలో ఉన్నా కూడా గర్వం చూపించకుండా అక్కడ పనిచేసే ఆర్టిస్టులు అందరితో చాలా బాగా కలిసిపోతుంది. అంతేకాకుండా ఎవరైనా కష్టమని ఆమెను సహాయం అడిగితే రోజా గారు వెంటనే స్పందిస్తారు. అందుకే ఆవిడంటే జబర్దస్త్ టీమ్ మెంబర్స్ అందరికీ ప్రత్యేకమైన అభిమానం” అంటూ రోజా గారి మనస్తత్వం గురించి అభి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.