చివరి నిమిషంలో ఉదయభాను బిగ్ బాస్ వెళ్లక పోవడానికి కారణం ఇదేనా?

బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభానికి ముందు ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ కొందరి పేర్లు వినిపించాయి ఆ పేర్లలో ఉదయభాను పేరు ఒకటి. ఉదయభాను ఇండస్ట్రీలో నటిగా యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈమె బిగ్ బాస్ హౌస్ కి వెళ్లబోతుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ విధంగా ఉదయభాను బిగ్ బాస్ ఎంట్రీ గురించి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ అయితే అవన్నీ కూడా ఫేక్ అని తెలుస్తుంది.నిజానికి బిగ్ బాస్ నిర్వాహకులు ఈమెని సంప్రదించారని అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఉదయభాను భారీ కండిషన్స్ పెట్టడం వల్లే ఆమెను నిర్వాహకులు లైట్ తీసుకున్నారని సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బిగ్ బాస్ ప్రారంభమయ్యే ముందు రోజు వరకు ఈమె ఎంట్రీ ఉంటుందని భావించినప్పటికీ చివరి నిమిషంలో తప్పకుందని వార్తలు వినిపించాయి.

ఇలా ఈమె బిగ్ బాస్ నుంచి తప్పుకోవడానికి ఓ కారణం ఉంది. ఈమె ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతున్న నేపథ్యంలో తనకు బిగ్ బాస్ హౌస్ లో వారానికి నాలుగు లక్షల రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారట. ఇలా తనకు వారానికి నాలుగు లక్షల ఇస్తేనే తాను బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటానని లేకపోతే లేదని ఖరాఖండిగా చెప్పడం వల్లే అంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వలేని బిగ్ బాస్ నిర్వాహకులు తనని లైట్ తీసుకున్నారని ఈ కారణం చేత తాను బిగ్ బాస్ కార్యక్రమంలో నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.