యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో ఓ భారీ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఉన్న గ్యాప్ లో ఎన్టీఆర్ తెలుగు మరో బిగ్గెస్ట్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” తో బిజీగా ఉన్నాడు. అయితే ఈ షోలో సామన్యులతో పాటుగా పలువురు సెలెబ్రిటీలు కూడా పాల్గొంటున్నారు.
అలా ఇప్పటి వరకు చాలా మంది పాల్గొనగా తాజాగా దసరా స్పెషల్ గా సమంతా కూడా హాజరు అయ్యింది. అయితే దీనికి ముందే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ గ్రాండ్ ఎపిసోడ్ ని ప్లాన్ చెయ్యగా అదిప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ ఎపిసోడ్ ని ఈ సీజన్ మొత్తం కంప్లీట్ అయ్యాక చిట్ట చివరి దానిలా టెలికాస్ట్ చేస్తారట. సో ఇంకా దీని కోసం అయితే ఆగాల్సిందే. అది ఎప్పుడు ఉంటుందో చూడాలి ఇక.