వామ్మో ఈ యాంకర్ల తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… ఒక్క కాల్ షీట్ కోసం లక్షల్లో రెమ్యూనరేషన్?

వెండితెర మీద సందడి చేసే హీరొ హీరోయిన్లతో పాటు బుల్లితెర మీద సందడి చేస్తున్న సీరియల్ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతే సినిమా హీరో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా రెమ్యూనరేషన్ అందుకు అంటున్నారు. బుల్లితెర మీద సందడి చేస్తున్న ప్రముఖ యాంకర్లు, నటీనటులు అందుకొని రెమ్యూనరేషన్ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బుల్లితెర యాంకర్ అనగానే మొదటగా గుర్తొచ్చే చెప్పారు సుమా కనకాల. ఎన్నో సంవత్సరాలుగా తన మాటల గారడీతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న సుమ ఒక్కో ఈవెంట్ కి నాలుగు నుండి ఐదు లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకు ఉంటుంది. ఇక టీవీ షోస్ కోసం ఒక కాల్ షీట్ కి దాదాపు రెండున్నర లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

ఇక బుల్లితెర యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ కూడా వరుస టీవీ షోలు చేస్తూ బాగానే సంపాదిస్తుంది. ఒక కాల్ షీట్ కోసం అనసూయ దాదాపు రెండు లక్షల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన రష్మీ కూడా ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో యాంకర్ గా కొనసాగుతోంది. ఈ షోలకు ఒక రోజు కోసం రష్మి ఒకటిన్నర లక్ష దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

ఇక మరొక అందాల యాంకర్ శ్రీముఖి కూడా బుల్లితెర మీద సందడి చేస్తోంది. చానల్ తో సంబంధం లేకుండా అన్ని చానల్స్ లోను సందడి చేస్తూ ఒక రోజు కోసం దాదాపు ఒకటిన్నర లక్ష దాకా రెమ్యూనరేషన్
అందుకుంటుంది.

అలాగే సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసే యాంకర్స్ మంజూష, శ్యామల ఒక ఈవెంట్ కోసం రూ. 50 వేల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

అలాగే బుల్లితెర మీద ప్రసారమవుతున్న సీరియల్స్ లో నటిస్తున్న నటీమణులు కూడా బాగానే సంపాదిస్తున్నారు. కార్తీకదీపం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ప్రేమే విశ్వనాథ్ ఒక రోజు కోసం దాదాపు రూ. 50 వేల వరకు డిమాండ్ చేస్తోంది.

అలాగే మీనాక్షి సీరియల్ ద్వారా గుర్తింపు పొందిన నవ్య స్వామి కూడా ఒకరోజు షెడ్యూల్ కోసం దాదాపు రూ. 30 వేల వరకు అందుకుంటున్నట్లు సమాచారం.

అలాగే సినిమాలలో హీరోయిన్గా నటించి తర్వాత బుల్లితెర హీరోయిన్ గా గుర్తింపు పొందిన సుహాసిని బుల్లితెర నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ అమ్మడు సీరియల్ లో రోజుకి రూ. 30 వేల వరకు పారితోషికం అందుకుంటోంది.

అలాగే త్రినాయిని సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందిన అషికా కూడా దాదాపు ఒక రోజుకి రూ. 12 వేలకు సంపాదిస్తోంది.

బుల్లితెర నటిగా గుర్తింపు పొందిన హరిత జాకి ఎన్నో ఏళ్లుగా సీరియల్స్ లో నటిస్తోంది. హరిత కూడా ఒక రోజు కోసం రూ. 12 వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం.