బిగ్ బాస్ ద్వారా శ్రీ సత్య అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరు సంపాదించుకున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ తెలుగు కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో శ్రీ సత్య ఒకరు. ఈమె మోడలింగ్ రంగంలో తన కెరియర్ ప్రారంభించి అనంతరం ఎన్నో సినిమాలు బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా బుల్లితెర, వెండితెరపై సందడి చేసిన శ్రీ సత్య బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చిన మొదట్లో ఈమె వ్యవహరించిన తీరుతో మొదటి నాలుగైదు వారాలలోనే ఎలిమినేట్ అవుతుందని భావించారు.

ఇలా శ్రీ సత్య ఏమాత్రం టాస్కులు ఆడకుండా ఉండడంతో నాగార్జున సైతం చివాట్లు పెట్టారు దీంతో తన ఆట తీరు మొత్తం మార్చుకున్నటువంటి ఈమె ఏకంగా 15 వారాల వరకు హౌస్ లో కొనసాగారు.టాప్ ఫైవ్ కి వెళ్లడానికి ఒక్క అడుగు దూరంలో ఈమె 15వ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా బయటకు వచ్చారు.ఇలా 15 వారాలపాటు హౌస్ లో ఉండి ఎంతో చలాకీగా ప్రేక్షకులను సందడి చేసిన ఈమె ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.

ఇలా 15వ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చినటువంటి శ్రీ సత్య ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయానికి వస్తే… సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం 15 వారాల పాటు హౌస్ లో కొనసాగిన శ్రీ సత్య సుమారు 34 లక్షలు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈమె శ్రీహన్ రేవంత్ కు సమానంగానే రెమ్యూనరేషన్ అందుకుందని చెప్పాలి.