అల్లు అర్జున్ హీరోగా ‘వరుడు’ అనే సినిమా చాలాకాలం క్రితం వచ్చింది. బహుశా అల్లు అర్జున్ కూడా ఆ సినిమా గురించి ఎప్పుడూ ఎక్కడా మాట్లాడాలనుకోడు. అంత పెద్ద డిజాస్టర్ అది. ఇంతకీ, వధువు ఎవరు.? అంటూ, అప్పట్లో హీరోయిన్‌ని దాచిన వైనం ఓ సంచలనం. హీరోయిన్ ఎవరో రివీల్ చేశాక.. సినిమాపై ఇంట్రెస్ట్ చచ్చిపోయింది అందరికీ. భానుశ్రీ మెహ్రా ఆ సినిమాలో హీరోయిన్. ఆమె ఆ తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు.
తాజాగా ఆ భానుశ్రీ మెహ్రా పేరు మార్మోగిపోతోంది. కారణం అల్లు అర్జున్, ట్విట్టర్‌లో భానుశ్రీని బ్లాక్ చేయడమే. అల్లు అర్జున్ తనను బ్లాక్ చేశాడంటూ భానుశ్రీ మెహ్రా వాపోయింది. దాంతో, ఈ అంశం పెద్ద వైరల్ టాపిక్ అయి కూర్చుంది. ఎందుకీ తలనొప్పి.? అనుకున్నాడో ఏమో, అల్లు అర్జున్.. ఆమెను అన్‌బ్లాక్ చేశాడు. ఆ విషయాన్ని ఆమె మళ్ళీ పేర్కొంది.
అసలు విషయమేంటంటే, సాధారణంగా సెలబ్రిటీల సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని వేరే వ్యక్తులు లేదా సంస్థలు నిర్వహిస్తాయ్. ప్రతి విషయానికీ అల్లు అర్జున్‌ని భానుశ్రీ ట్యాగ్ చేస్తూ, తన పబ్లిసిటీ పెంచుకోవడానికి ప్రయత్నిస్తుండడం వల్లే ఆమెను బ్లాక్ చేయడం జరిగిందట.