వాళ్ళు వ్యభిచారులు అయితే బిగ్ బాస్ లో ఉన్నది ఎవరు.. సీపీఐ నారాయణ కామెంట్స్ వైరల్!

దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో దేశంలో నెంబర్ 1 రియాలిటీ షో గా గుర్తింపు పొందింది. ఈ షో ఆదరించి ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు.ఈ షో పట్ల విమర్శలు చేసే ప్రేక్షకులు కూడా అంతే మంది ఉన్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ షో గురించి సిపిఐ నాయకుడు నారాయణ చాలాకాలంగా విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోని బ్రోతల్ హౌస్ తో పోల్చుతూ విమర్శలు చేసిన నారాయణ ఆ షోనీ హోస్ట్ చేస్తున్న నాగార్జున మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇక ఇటీవల నారాయణ మరొకసారి ఈ బిగ్ బాస్ షో మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల నల్గొండలో వ్యభిచారం చేస్తున్న ఇద్దరు మహిళలకు స్థానికులు గుండు కొట్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై నారాయణ స్పందిస్తూ సాధారణ మహిళలకు వ్యభిచారం పేరుతో గుండు కొట్టించారు.. మరి బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతున్నారు. ఆ మహిళలతో పాటు బిగ్ బాస్ లో ఉన్న వాళ్లు కూడా వ్యభిచారులే. వీరికి గుండు కొట్టించి వాళ్ళని మాత్రం ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ? అంటూ ప్రశ్నించాడు.

సామాన్య ప్రజలకు గుండు కొట్టించి అవమానపరిచి బిగ్ బాస్ షోని మాత్రం ప్రోత్సహిస్తున్నారు. బిగ్ బాస్ లో ఉన్న వారికి కూడా గుండు కొట్టించండి అంటూ మండిపడ్డారు. ప్రస్తుత కాలంలో యువత పక్కదోవ పట్టకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ షోని వ్యతిరేకిస్తున్నానని నారాయణ ఈ సందర్భంగా తెలియజేశాడు. నారాయణ బిగ్ బాస్ షో గురించి ఇటీవల చేసిన ఈ వ్యాఖ్యలు మరొకసారి సంచలనంగా మారాయి. ఈ విషయంపై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి మరి.