నన్ను అలా అంటే ఇంటర్వ్యూ అని కూడా చూడను.. యాంకర్ శివకి వార్నింగ్ ఇచ్చిన ఆరోహి..?

టీవి 9 లో ప్రసారమవుతున్న ఇస్మార్ట్ న్యూస్ ద్వారా అంజలి గా గుర్తింపు పొందిన ఆరోహి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఆరోహి 4 వారాలపాటు హౌస్ లో కొనసాగింది. ఇటీవల నాల్గవ వారంలో జరిగిన ఎలిమినేషన్ స్లో ఆరోహి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చింది. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొన్న ఆరోహి హౌస్ లో ఉన్న సమయంలో ఆర్జె సూర్యతో ఉన్న రిలేషన్ వల్ల కొంచెం నెగెటివిటీ మూట కట్టుకుంది.

ఇక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత యాంకర్ శివ పోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ బజ్ కి హాజరయ్యింది. ఈ క్రమంలో యాంకర్ శివ బిగ్ బాస్ హౌస్ లో ఆరోహి జర్నీ గురించి మాట్లాడుతూ వివాదాస్పదమైన ప్రశ్నలు వేశాడు. ఈ క్రమంలో జర్నీ ఎలా సాగింది అని శివ అనగానే.. కొంతమందితో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను అంటూ సమాధానం చెప్పింది.

ఆ తర్వాత మరొక సందర్భంలో ఆర్జె సూర్యతో ఆరోహికి ఉన్న రిలేషన్ గురించి ప్రస్తావించగా మాది ప్యుర్ ఫ్రెండ్షిప్ అని సమాధానం చెప్పింది. అంతా ప్యూర్ అని ఎవరికి అనిపించటం లేదు అని శివ పచ్చకామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అంటుంది. అంటే నువ్వు చేసేది కరెక్ట్ అంటున్నావా? అని శివ అనగానే…నా గురించి అలా తప్పుగా మాట్లాడితే ఇంటర్వ్యూ అని కూడా చూడను అంటూ కోపంతో శివ కి వార్నింగ్ ఇచ్చింది.