నాలుగు నెలల కడుపుతో ఉన్నప్పుడు ఆ పాటకు డాన్స్ చేశా… రమ్యకృష్ణ !

సౌత్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన అలనాటి అందాల నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాజిటివ్ నెగిటివ్ క్యారెక్టర్స్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలలో నటించి తన అందం అభినయంతో ఆకట్టుకున్న రమ్యకృష్ణ ఇప్పటికీ మంచి మంచి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండే రమ్యకృష్ణ ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టైగర్ సినిమాలో కూడా కీలకపాత్రలో నటించింది.

ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో రానున్న రంగమార్తాండ సినిమాలో కూడా రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది. ఇలా ఒకవైపు వరస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రమ్యకృష్ణ.. ప్రస్తుతం ఆహాలో ప్రసారం అవుతున్న ‘ డాన్స్ ఐకాన్ ‘ అనే డాన్స్ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకొని అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతుంది.

ఇక ఈవారం ప్రసారం కాబోయే డాన్స్ ఐకాన్ షో కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలయ్యింది. ఈ ఎపిసోడ్లో ఒక కంటెస్టెంట్ ‘నా అల్లుడు’ సినిమాలోని ‘సయ్యా సయ్యారే’ అనే పాటకు అదిరిపోయే మాస్ స్టెప్పులు వేసి అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో ఈ పాటకు రమ్యకృష్ణ డాన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. గతంలో ఈ పాటకు డాన్స్ చేసే సమయంలో ఉన్న తన అనుభవాల గురించి రమ్యకృష్ణ చెబుతూ… ఈ పాట నాకు ఎంతో స్పెషల్.. ఈ పాటకి డాన్స్ చేసే సమయంలో నేను 4 నాలుగు నెలల గర్భవతిని అంటూ చెప్పుకొచ్చింది.