హద్దులు దాటిన రష్మి కోరికలు… వామ్మో ఆది ఇలా అన్నాడేంటి..?

ఈటీవీలో ప్రసాదం జబర్దస్త్ కామెడీ షో కి ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఈ కామెడీ షో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. అయితే గత కొంతకాలంగా ఆది జబర్దస్త్ లో కనిపించడం లేదు. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రాంప్రసాద్ తో కలిసి ఆది చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈ షో లో ఇద్దరూ కలిసి రష్మిని ఒక ఆట ఆడుకుంటున్నారు. షో మొదలైన దగ్గర నుండి పూర్తయ్యే దాకా రష్మి మీద సెటైర్లు , పంచ్ లు వేస్తుంటారు.

ఇటీవల ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా ఆది, రాంప్రసాద్ వచ్చి రాగానే తమ పంచ్ లతో రష్మి మీద విరుచుకుపడ్డారు. రష్మీ ఏది మాట్లాడినా కూడా సుధీర్ పేరు బయటపెట్టకుండా బాబు బాబు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆది రాంప్రసాద్ రాగానే పనిలేని వాళ్ళందరూ ముందే వచ్చేస్తారు అని రష్మీ అంటుంది. అదే మీరు ఎందుకు వచ్చారు ముందే అని రాం ప్రసాద్ పంచ్ వేస్తాడు. ఇక ఈ ఎపిసోడ్లో రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ క్యాలెండర్ లాంచ్ చేయటం కోసం క్యాలెండర్ ను చేతిలో పట్టుకుని ఇదేంటో తెలుసా అని అడుగుతుంది ఏంటి బాబు నీకు విడాకులు ఇస్తున్నాడా ?అని ఆది పంచ్ వేస్తాడు.

ఈ ఎపిసోడ్ లో క్యాలెండర్ లాంచ్ కోసం ఆది, రామ్ ప్రసాద్ గొడవ పడటంతో వారికి సపోర్ట్ గా ఇద్దరు తమ టీమ్ మెంబర్స్ ని పిలుస్తారు. ఈ క్రమంలో కూడా ఆది పరదేశి , ఐశ్వర్య మీద పంచ్ లు వేస్తాడు.ఇక ఎపిసోడ్ మధ్యలో రష్మీ మాట్లాడుతూ.. వెయ్యి ఎపిసోడ్‌లకు నేనే యాంకర్‌గా ఉంటా, అట్లుంటది మనతోని అంటూ రెచ్చిపోయింది. దీంతో ఆది స్పందిస్తూ అంతలేదులే.. ఇంకో నాలుగైదు ఎపిసోడ్‌లే అన్నట్టుగా ఆది, రాం ప్రసాద్‌లు కౌంటర్లు వేస్తారు. మొత్తానికి ఈ షోలో అది రాంప్రసాద్ ఇద్దరూ కలిసి రశ్మిని ఒక ఆట ఆడుకుంటున్నారు. రష్మీ సైతం ఆది, రాం ప్రసాద్‌ల సెటైర్ల కు ఫీల్ అవకుండా ఎంతో స్పోర్టీవ్‌గా తీసుకుని ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తోంది.