వర్షిణిపై ఇంట్రెస్ట్ ఉంది!.. ఎట్టకేలకు మనసులో మాట చెప్పేసిన హైపర్ ఆది

బుల్లితెరపై హైపర్ ఆది-వర్షిణి జంట గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. ప్రేమలో ఉన్నారని వార్తలు రావడమే కాదు ఏకంగా పెళ్లి కూడా ఫిక్స్ అయిందనే వార్తలు అప్పట్లో తెగ హల్చల్ చేశాయి. యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా వీరి సందడే కనిపించేది. ఒకానొక సమయంలో రష్మీ సుధీర్ జంటను కూడా బీట్ చేసి ట్రెండింగ్‌లో వచ్చేశారు. అదంతా ఢీ షో మహిమే. ఢీ లో వీరిద్దరూ కలిసి చేసిన రచ్చకు అందరూ ఫిదా అయ్యారు.

Hyper Aadi ABout Varshini In ALi Tho saradaga
Hyper Aadi ABout Varshini In ALi Tho saradaga

తాజాగా ఈ ఇద్దరినీ తన షోకు గెస్ట్‌లుగా తీసుకొచ్చాడు అలీ. అలీతో సరదాగా షోలో హైపర్ ఆది వర్షిణి తమ మనసులోని మాటలు చెప్పేశారు. వర్షిణి తన బ్రేకప్ స్టోరీ చెప్పగా.. హైపర్ ఆది తన మనసులో మాట చెప్పేశాడు. అయితే మరి అది సరదా కోసం చెప్పాడో లేదా లోపల ఉన్నదే చెప్పాడో తెలీదు కానీ హైపర్ ఆది చెప్పిన డైలాగ్‌లు మాత్రం అదిరిపోయాయి. అవి వర్షిణి మీద ఉన్న ప్రేమను చాటి చెప్పేలా ఉన్నాయి.

Hyper Aadi ABout Varshini In ALi Tho saradaga
Hyper Aadi ABout Varshini In ALi Tho saradaga

గతంలో తనకు బ్రేకప్ అయింది.. సెట్ కాలేదు అని వర్షిణి చెబుతూ ఉంటే.. అందుకే సెట్ అయ్యేవాళ్లని చూసుకోవాలి అంటూ హైపర్ ఆది తన వైపు చేతులు చూపిస్తూ డైలాగ్ కొట్టేశాడు. దీంతో పగల బడి నవ్విన అలీ.. ఏంటీ వర్షిణి అంటే అంత ఇంట్రెస్టా? అని అడిగేశాడు. వెంటనే హైపర్ ఆది సమాధానం చెబుతూ.. వర్షిణి ఏంటండి అందంగా ఉంది అనడంతో వర్షిణి తెగ సిగ్గుపడిపోయింది. మొత్తానికి వీరి ప్రేమకు మొలకలు పడ్డట్టున్నాయి.

Alitho Saradaga Episode 198 Latest Promo | Hyper Aadi & Varshini on ETV