ఇంకా ఎన్నాళ్లు ఈ చీప్ ట్రిక్స్.. మీరు మారరు మల్లెమాలపై ట్రోల్ చేస్తున్న నెటిజన్స్?

మల్లెమాల నిర్మాణ సంస్థ బుల్లితెరపై జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాలను గత కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇలా ఈ కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం పై ప్రేక్షకులలోఎన్నో అంచనాలను కలిగించడం కోసం ఎంతో విభిన్నంగా కాంట్రవర్సీయల్ గా ప్రోమో కట్ చేసి విడుదల చేయడం మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా ఈ ప్రోమో చూసిన అభిమానులు ఈ కార్యక్రమం పై పెద్ద ఎత్తున ఆత్రుత కనబరుస్తున్నారు.

ఇకపోతే ఈ కార్యక్రమం ప్రసారమై చూస్తే అందులో ఏమీ ఉండదు. ఇలా ప్రోమోల ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను ఫూల్స్ ను చేస్తున్నారు.అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో ఏకంగా బిగ్ బాస్ కార్యక్రమాన్ని తలపించిందని చెప్పాలి.ఈ కార్యక్రమంలో భాగంగా నచ్చని వారి ఫోటోలను చింపడం లేదా కాల్చి వేయడం వంటి టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా ఆటో రాంప్రసాద్ రష్మీ పరదేశి కూడా హైపర్ ఆది ఫోటోని చింపేయడం గమనార్హం.

ఈ ప్రోమో చూస్తే అందరూ సరదాగా సందడి చేసే వీరి మధ్య కూడా ఇలాంటి విభేదాలు ఉన్నాయా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు.ఇకపోతే హైపర్ ఆది సైతం ఎవరి ఫోటో చేతిలో పట్టుకొని చింపేయబోయారు కానీ అతని ఎవరు అనేది మాత్రం సస్పెన్స్ గా పెట్టారు.ఇలా ఈ ప్రోమో కట్ చేయడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ మల్లెమాల వారిని దారుణంగా ఆడుకుంటున్నారు. మీరు ఈ జన్మకి మారరు ఇలాంటి చీప్ ట్రిక్స్ ద్వారా మీ కార్యక్రమానికి రేటింగ్స్ పెంచుకోవడం కోసం ఇంకెన్ని రోజులు ఇలాంటివి ప్లే చేస్తారు అంటూ పెద్ద ఎత్తున మల్లెమాల వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.