మెగాస్టార్ చిరంజీవి తిరిగి సినిమాల్లోకి వచ్చాకా, చిన్నచిన్న ఆర్టిస్టులకు మంచి ఉపాధి దొరికిందని చెప్పడంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు. ముఖ్యంగా జబర్దస్త్ ఆర్టిస్టులకు మంచి ప్రమోషన్, ప్లేస్‌మెంట్ దక్కుతోంది సినిమాల్లో.
హైపర్ ఆది, గెటప్ శీను.. తదితర జబర్దస్త్ ఆర్టిస్టులకు చిరంజీవి తన సినిమాల్లో మంచి మంచి పాత్రలిచ్చి వారిలో దాగున్న అద్భుతమైన టాలెంట్ కేవలం బుల్లితెరకే పరిమితమైపోకుండా పెద్ద తెరతో ప్రమోట్ చేస్తున్నారు.
అయితే, ‘భోళా శంకర్’ విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. ఎవరికో కన్ను కుట్టింది. ఇలా జబర్దస్త్ ఆర్టిస్టులను మెగాస్టార్ చిరంజీవి ఈ స్థాయికి తీసుకురావడం నచ్చడం లేదు కాబోలు బహుశా సో కాల్డ్ ప్రబుద్ధులకు.
మెగాస్టార్ చిరంజీవికి ఉచిత సలహాలిస్తున్నారట ఈ బ్యాచ్‌ని దూరం పెట్టాలని. ఈ జబర్దస్త్ బ్యాచ్ కారణంగానే ‘భోళా శంకర్’ సినిమా ఫెయిలైందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంతకు ముందెప్పుడూ లేనంత నెగిటివిటీ వచ్చేసింది చిరంజీవి ఈ సినిమాతో.
అయితే, సదరు ఆర్టిస్టులు మాత్రం చిరంజీవి మాకు పునర్జన్మనిచ్చారు.. మమ్మల్ని ఉన్నతంగా ఆదుకుంటున్నారంటూ చెప్పుకొస్తున్నారు. అంతెందుకు హరీష్ శంకర్ వంటి దర్శకుడు సైతం, చిరంజీవి సినిమాల కారణంగానే ఎంతో మంది దర్శకులకు సైతం మైలేజ్ వస్తోందని వ్యాఖ్యానించారు.
సో, ఎవరో ఉచిత సలహాలిచ్చారని చిరంజీవి తన పంథా మార్చుకుంటారని చెప్పలేం. సాయం చేసే చెయ్యి ఎప్పుడూ వెనుకడుగు వేయదుగా. నమ్మిన వారిని చిరంజీవి ఎప్పుడూ దూరం పెడతారని అనుకోలేం.