జబర్దస్త్ ద్వారా హైపర్ ఆది ఎన్ని కోట్ల ఆస్తులు కూడపెట్టాడో తెలుసా..?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. గత పది సంవత్సరాలుగా ప్రసారమవుతున్న ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమీడియన్లుగా పాపులర్ అయ్యి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్న ఆదికి అదిరే అభి ద్వారా జబర్దస్త్ లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇలా జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన అది కొంతకాలానికి టీం లీడర్ గా ఎదిగాడు.

జబర్దస్త్ షో లో ఆది వేసే పంచులు సెటైర్లు ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఆది క్రేజ్ మరింత పెరిగింది. ఇలా ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ వంటి అన్ని షోలలో అది పాల్గొని సందడి చేస్తూ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాడు. ఇలా టీవీ షోల ద్వారా వచ్చిన గుర్తింపుతో ఆదికి సినిమాలలో నటించే అవకాశాలు కూడా లభించాయి. సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే కాకుండా హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటించాడు. టీవీ షోలు, సినిమాలలో నటిస్తూ ఆది అధిక మొత్తంలో డబ్బు సంపాదించినట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం.

హైపర్ ఆది ఆస్తులకు సంబంధించిన వివరాల గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. హైపర్ ఆది ఇండస్ట్రీకి రాకముందు సొంతూరులో ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉండేదట . అంతే కాకుండా హైపర్ ఆది ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చినప్పుడు తమకి ఉన్న మూడూ ఎకరాలు అమ్మి వాళ్ళ నాన్న 20వేల రూపాయలు ఇచ్చాడట. కానీ ఇప్పుడు హైపర్ ఆది ఇండస్ట్రీకి వచ్చాక రూ. 50 కోట్లకు పైగా ఆస్తులు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల హైపర్ ఆది హైదరాబాద్ లో 10 కోట్ల రూపాయల విలువైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో హైపర్ ఆది అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.