బిగ్ బాస్ మొదటి కెప్టెన్ అతనే .. వరస్ట్ కంటెస్టెంట్ గా జైలుకు వెళ్లిన గీతూ!

బిగ్ బాస్ కార్యక్రమం ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమై ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది. ఈ క్రమంలోనే మొదటివారం నామినేషన్ ప్రక్రియలోభాగంగా ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్లు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈవారం కెప్టెన్సీ దారిలో పోటీలో భాగంగా ఆరుగురు కంటెస్టెంట్లు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఆరుగురిలో కెప్టెన్సీ కోసం పోటీపడుతూ బాలాదిత్య గెలిచినట్లు తెలుస్తోంది.

మొదటి వారం కెప్టెన్ గా బాలాదిత్య బాధ్యతలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక ఫస్ట్ వీక్ వరస్ట్ పర్ఫామెర్ గా గీతూ రాయల్ జైలుకు వెళ్లినట్టు బిగ్ బాస్ ప్రోమో ద్వారా తెలుస్తుంది.గీత హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి తన మాటలతో అందరికి విసుగు తెప్పించడమే కాకుండా అందరితోను వాదనకు దిగడంతో తనని వరస్ట్ పెర్ఫామార్ గా జైలుకు పంపించినట్టు తెలుస్తోంది. ఇక బాలాదిత్య సైతం మొదటి నుంచి హౌస్ లో అందరికీ న్యాయం చెబుతూ అందరి పట్ల ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు.

ఇక ఈవారం కెప్టెన్సీలో భాగంగా బాలాదిత్య గెలిచినట్టు తెలుస్తుంది.ఇకపోతే ఈ వారం నామినేషన్ లో ఏడుగురు కంటెస్టెంట్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే వీరిలో అరోహి అభినయశ్రీ డేంజర్ జోన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఎప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే వారి పేరు ముందుగానే సోషల్ మీడియాలో లీక్ అవుతూ ఉంటుంది. ఈసారి కూడా అలాగే జరుగుతూ వస్తోంది. ఇక ఈవారం అభినయశ్రీ ఆరోహి డేంజర్ జోన్ లో ఉండగా వీరిద్దరిలో ఒకరు తప్పకుండా బయటకు వెళ్తారని వార్తలు వస్తున్నాయి. మరి ఆ ఒక్కరు ఎవరో తెలియాల్సి ఉంది.