బిగ్ బాస్ రివ్యూల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గలాట గీతూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ రివ్యూల ద్వారా ఫేమస్ అయిన ఈమె ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ కార్యక్రమం వంటి బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ తనని దారుణంగా బాడీ షేమింగ్ చేస్తున్నారంటూ కంటతడి పెట్టుకున్నారు. చిన్నప్పటినుంచి తాను ఇలాంటి అవమానాలను ఎదుర్కోవడం వల్లే తాను నిండుగా వస్త్రధారణ వేసుకుంటానని అయినప్పటికీ కొందరు తనని బాడీ షేమింగ్ చేస్తున్నారంటూ కంటతడి పెట్టుకున్నారు.
ఇలా ఈమె తన బాడీ షేమింగ్ గురించి బాధపడటంతో కొందరు గతంలో తాను షణ్ముఖ్ జస్వంత్ బాడీ షేమింగ్ గురించి మాట్లాడినప్పుడు ఏమైంది అంటూ కామెంట్లు చేస్తున్నారని అయితే ఆయన బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు మాత్రమే తన గురించి మాట్లాడని అలా మాట్లాడటం తన బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ తర్వాత ఆయన బయటికి వచ్చిన అనంతరం తన గురించి ఎక్కడ తాను తప్పుగా మాట్లాడలేదని అలా మాట్లాడే అవసరం కూడా తనకు లేదని తెలిపారు.
ఇలా నేను కన్నీళ్లు పెట్టుకోవడంతో కొందరు సింపతి కోసమే ఇలా చేస్తున్నానని కూడా కామెంట్లు చేస్తున్నారని అయితే సింపతి చూపించాల్సిన అవసరం తనకు లేదని తనకు ఎంతో టాలెంట్ ఉంది ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. తనకు సింపతి కోసం అలా చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎవరి గురించి అయినా బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడినట్లు వీడియోలు కనుక ఉంటే తనకు పంపించాలని అందులో నిజం కనుక ఉంటే తాను బహిరంగంగా క్షమాపణలు చెబుతా అంటూ ఈమె తన ఆవేదన వ్యక్తం చేశారు.