దేవయానిని టార్గెట్ చేసిన గౌతమ్… చీరలో మెరిసిపోతున్న వసుధారా!

బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకు విపరీతమైన ఆదరణ సంపాదించుకుంటుంది. నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే.. వసుధార జగతి ఇద్దరు మాట్లాడుతూ ఎప్పుడు మీరు మీ కొడుకుకి సపోర్ట్ చేస్తారు అంటూ మాట్లాడతారు అనగా జగతి సరే మీ ఎండికి నచ్చినది తీసుకోమని చెప్పు అంటూ మాట్లాడుతుంది. అప్పుడు వసుధార మీకు నచ్చినది తీసుకోమని మెసేజ్ చేయడంతో చివరికి సెలక్షన్ నా పైన వదిలేశారు చాలా జాగ్రత్తగా తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు కాలేజ్ స్టాఫ్ స్టూడెంట్స్ కి వన భోజనాలు గురించి గౌతమ్ చెబుతుంటాడు.

ఇంతలోపే దేవయాని అక్కడికి వచ్చి వనభోజనాల కోసం తనకు ప్రత్యేకంగా చీర తయారు చేయమని చెప్పాను చేసావా అంటూ ధరణిపై మండిపడుతుంది. అంతలో మహేంద్ర అక్కడికి వచ్చి గౌతమ్ వన భోజనాల గురించి కాలేజీలో అందరికీ చెప్పవా అని అడగగా చెప్పాను అంకుల్ అని చెబుతాడు.రిషిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పగా వాడిని చూసుకోవడానికి వసుధార ఉంది కదా వాడే నన్ను చూసుకోవాలి అని సమాధానం చెబుతాడు.

మరోవైపు ఈ వనభోజనాల కార్యక్రమానికి దేవయాని పెద్దమ్మను రాకుండా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక అందరూ కూర్చుని భోజనం చేస్తుండగా దేవయాని వనభోజనాల ప్లానింగ్ ఏంటి అని అడుగుతుంది. వసుధార కోసం తన గదిలో గిఫ్ట్ పెట్టిన విషయాన్ని మెసేజ్ చేస్తాడు. దీంతో వసుధారా థాంక్యూ మేడం అని చెప్పగా అందరూ షాక్ అవుతారు. దీంతో మీరే కవర్ చేయండి సార్ అని చెప్పగా థాంక్యూ అనేది కొత్త గేమ్ అంటూ రిషి ఏదో కవర్ చేస్తాడు.

మరోవైపు గౌతమ్ పెద్దమ్మని ఎలాగైనా మన భోజనాలకు రాకుండా ఆపాలని తనని టార్గెట్ చేస్తూ వేడిగా ఉన్నటువంటి హాట్ బాక్స్ కావాలనే తన కాలిపై వేస్తాడు. దీంతో తాను వనభోజనాలకి రాలేకపోతున్నానని చెప్పగా రిషి మీరంతా వెళ్ళండి పెద్దమ్మకు తోడుగా నేను ఉంటానని చెప్పడంతో గౌతమ్ షాక్ అవుతాడు. అంతలో ఫణీంద్ర మినిస్టర్ గారు వస్తున్నారు కదా రిషి నువ్వు వెళ్ళు అని చెప్పగా ఓకే అని చెప్పి బయలుదేరుతాడు. ఇక వసుధర రిషి తనకోసం తెచ్చిన చీర కట్టుకొని అద్దం ముందు తయారవుతూ ఉండగా రిషి లోపలికి వెళ్లి తనని ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఇక అక్కడే ఉన్నటువంటి గులాబీ పువ్వు తీసుకొని తన తలలో పెట్టమని వసుధార సైగ చేస్తుంది.