అన్‌స్టాపబుల్ షోపై మండిపడుతున్న ఫ్యాన్స్… కారణం అదేనా?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ సీజన్ వన్ మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి సీజన్ కి ఇలా ప్రేక్షకుల ఆదరాభిమానాలు లభించటంతో ఇటీవల అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ప్రారంభించారు. ఆహా వేదికగా ప్రసారమవుతున్న ఈ టాక్ షో సీజన్ 2 లో రెండు ఎపిసోడ్ లు పూర్తి అయ్యాయి. ఈ అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్లో బాలకృష్ణ వియ్యంకుడు ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తో పాటు బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ కూడా అతిధులుగా హాజరయ్యారు.

మొదటి ఎపిసోడ్ లో బావ, అల్లుడితో కలిసి బాలకృష్ణ చేసిన సందడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రాజకీయ వ్యవహారాలతో ఎప్పుడు సీరియస్ గా ఉండే చంద్రబాబు నాయుడు ఈ షోలో మనస్ఫూర్తిగా ఎన్నో విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈ మొదటి ఎపిసోడ్ లో బాలకృష్ణ చంద్రబాబు నాయుడు మధ్య జరిగిన ఏపీ రాజకీయ విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక ఇటీవల అన్ స్టాపబుల్ సీజన్ 2 రెండవ ఎపిసోడ్ కూడా పూర్తి అయింది. ఈ రెండవ ఎపిసోడ్లో టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ రెండవ ఎపిసోడ్ లో బాలకృష్ణ కుర్ర హీరోలతో కలిసి యువకుడిగా మారిపోయి రచ్చ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 లో 3వ ఎపిసోడ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఇక ఈ మూడవ ఎపిసోడ్ కి బదులు చంద్రబాబు నాయుడు గెస్ట్ గా వచ్చిన మొదటి ఎపిసోడ్ నే తిరిగి స్ట్రీమింగ్ చేయడంతో ఆహా నిర్వాహకులు పట్ల ప్రేక్షకులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మొదటి రెండు ఎపిసోడ్ లతో ప్రేక్షకులలో వచ్చిన పాజిటివ్ టాక్ మొత్తం మూడవ ఎపిసోడ్ తో పోయింది. కనీసం వచ్చే వారమైన కొత్త ఎపిసోడ్ ప్రసారం చేస్తారా? అంటూ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.