దసరా స్పెషల్.. భర్తకు ఇష్టమైన వంటను వండి పెట్టిన సుమ.. వైరల్ అవుతున్న వీడియో!

బుల్లితెర యాంకర్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుమ వ్యాఖ్యాతగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా భారీగానే సంపాదిస్తున్నారు.ఇకపోతే ప్రతి చిన్న విషయాన్ని తన ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకునే సుమ తాజాగా దసరా పండుగ సందర్భంగా కూడా ఒక వీడియోని చేశారు.

సుమ సాధారణంగా ఏదైనా పండుగ వస్తే ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పండగ స్పెషల్ గా ఎలాంటి వంటలను ప్రసాదాలను తయారు చేస్తున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోని దసరా పండుగ సందర్భంగా అభిమానులకు దసరా పండుగ, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోని దసరా పండుగ ప్రత్యేకంగా నెయ్యి అప్పం ప్రసాదాలుగా తయారు చేసినట్లు ఈమె తెలిపారు.

ఇకపోతే వాంగిబాత్ కూడా తయారు చేస్తూ వాంగిబాత్ తన అత్తయ్య చాలా స్పెషల్ గా తయారు చేస్తారని వాంగిబాత్ అంటే తన భర్త రాజీవ్ కనకాలకు ఎంతో ఇష్టం అంటూ ఈమె తెలియజేశారు. అందుకే తన భర్తకు ఇష్టమైన వాంగిబాత్ తనకోసం స్పెషల్ గా చేశానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సుమ యధావిధిగా బుల్లితెర కార్యక్రమాలతోపాటు సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా ఉన్నారు.

https://youtube.com/shorts/8WCE7X_lI9s?feature=share