బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు ఎంతో ఆసక్తిగా మారుతుంది సీరియల్ లో ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే.. దీప సౌర్య కోసం హాస్పిటలో వెతుకుతూ కళ్ళు తిరిగి పడిపోగా వెంటనే కార్తీక్ తనని పట్టుకొని నీకు ఎన్నిసార్లు చెప్పాను బయటికి రావద్దని అంటూ తనపై సీరియస్ అవుతాడు. ఇక్కడ ఎవరికైనా శౌర్య తెలిసే ఉంటుంది ఏమోనని అడిగాను డాక్టర్ బాబు అంటూ దీప చెబుతుంది. ఈ సమయంలో బయటకు రాకూడదని చెప్పాను కదా అంటూ కార్తీక్ సీరియస్ అవుతాడు.అంతలోపు మరో డాక్టర్ అక్కడికి రావడంతో నేను అలా పక్కకు వెళ్లేసరికి దీప బైటికి వెళ్లిపోయింది అని చెప్పగా ఎమర్జెన్సీ ఉంటే నేను బయటకు వెళ్లాను డాక్టర్ అని చెబుతుంది.
మరోవైపు మోనిత గదిలో బంధించి ఉండగా అసలు దీప కార్తీక్ ఎక్కడికి వెళ్లారు ఏం చేస్తున్నారు అని కంగారు పడుతూ ఉంటుంది. అంతలోపే సౌందర్య అక్కడికి రావడంతో ఏంటి అలా కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నావు అని అడుగుతుంది. ఏం చేయమంటావు అంటీ నన్ను ఇలా నాలుగు గోడల మధ్య బంధించావు. అవతల నాకు బోలెడన్ని పనులు ఉన్నాయి అంటూ సమాధానం చెబుతుంది. ఇలా నాలుగు గోడల మధ్య ఉంటే ఏం చేయాలో దిక్కుతోచడం లేదు అని చెప్పగా ఇంట్లో పనులన్నీ చేయి అని సౌందర్య షాక్ ఇస్తుంది.
అక్కడ నేను నా బట్టలు వ్యాపారం చూసుకోవాలి అని మోనిత చెప్పగా…నీ బట్టల వ్యాపారం వెనుక ఏదుందో తెలుసుకోకుండా నిన్నెలా వదులుతాను అంటూ సౌందర్య మోనితకు చుక్కలు చూపిస్తుంది.మరోవైపు డాక్టర్ బాబు దీపకు ఆపరేషన్ చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. దీపా అప్పుడు కూడా నాకు ఏమన్నా అయితే సౌర్యను వెతికే బాధ్యత మీదే నేను వెళ్ళిపోయాక రెండు కన్నీటి చుక్కలు రాల్చి వదిలేయకండి అంటూ ఎమోషనల్ అవుతుంది. దాంతో దీపకు అసలు విషయం చెబితే గాని స్థిమితంగా పడుకోదని తనకు గతం గుర్తుకొచ్చిందనే విషయాన్ని చెబుతాడు. అయితే అప్పటికే దీప నిద్రలోకి వెళ్లిపోయి ఉంటుంది.
మరోవైపు ఇంద్రుడు చంద్రమ్మ దీప కార్తిక్ కోసం వెతుకుతూ ఉంటారు. ఎలాగైనా సౌర్యను వాళ్లకు అప్పగించాలని కార్తీక్ దీప కోసం వెతుకుతూ ఉంటారు. అలాగే ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత డాక్టర్స్ అందరూ మాట్లాడుతూ ఉంటారు కార్తీక్ దీప దగ్గర కూర్చొని ఉండగా దీపకు స్పృహ వస్తుంది. స్పృహ రాగానే శౌర్య కోసం వెతికార డాక్టర్ బాబు శౌర్య దొరికిందా అంటూ మాట్లాడుతుంది అప్పటికి కార్తీక్ ఏమీ మాట్లాడకపోవడంతో మిమ్మల్ని నమ్ముకుని నేను తప్పు చేశాను ఎలాగైనా నేనే వెళ్తాను అంటూ పైకి లేస్తుండగా అక్కడే ఉన్నటువంటి మరొక డాక్టర్ షటప్ దీప అప్పటినుంచి చూస్తున్నాను.ఈయన ఇక్కడే నీకోసం ఎందుకు ఉన్నారో తెలుసా అంటూ డాక్టర్ సీరియస్ గా వెంటనే వంటలక్క ఆయన నాకు ఏమైనా ఆపరేషన్ చేశారా అంటూ అనడంతో అవును కార్తీక్ సార్ మీకు ఆపరేషన్ చేశారు అని డాక్టర్ చెప్పగా ఒక్కసారిగా షాక్ అవుతుంది.