సుమ నోటివెంట డబుల్ మీనింగ్ డైలాగులు.. నీకు ఇలాంటి బూతు టీవి భాష అవసమా..?

బుల్లితెర మీద యాంకర్లుగా చలామణి అవుతున్న వారిలో సుమ కనకాల కూడా ఒకరు. ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా కొనసాగుతున్న సుమ బుల్లితెర మహారాణిగా గుర్తింపు పొందింది. ఒకవైపు టీవీ షోలు మరొకవైపు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లతో నిత్యం బిజీగా ఉండే సుమ సినిమాలలో కూడా నటించింది. అయితే ప్రస్తుతం సుమ టీవీ షోల మీద శ్రద్ధ తగ్గించి తన మొత్తం సమయాన్ని సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు కేటాయిస్తోంది. ప్రస్తుతం సుమ ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ షోలో మాత్రమే యాంకర్ గా కొనసాగుతోంది. ఈ షో లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్లతో సుమ అడించే ఫన్నీ టాస్క్ లు , సుమ వేసే పంచ్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంతున్నాయి.

తాజాగా ఈ వారం క్యాష్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ ఎపిసోడ్ లో వాంటెడ్ పండుగాడ్ సినిమా టీమ్ సందడి చేసింది. ఆగస్ట్ 19న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా క్యాష్ షోలో సందడి చేశారు. ఈ క్రమంలో ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాఘవేంద్రరావు, అనసూయ, నిత్యా శెట్టి, యశ్వంత్ మాష్టర్, విష్ణు ప్రియ సందడి చేశారు. ఇక ఈ ఎపిసోడ్ లో సుమ అనసూయకు ఒక ఫన్నీ టాస్క్ ఇచ్చింది. టాస్క్ లో భాగంగా సుమ అడిగిన ప్రశ్నకు అనసూయ సమాధానం చెప్పకుండా ఉండాలంటే కళ్ళు మూసుకొని ఐస్ క్రీం సుమ నోట్లో పెట్టాలని టాస్క్ ఇచ్చింది.

ఈ టాస్క్ లో భాగంగా సుమ ప్రశ్న అడుగుతూ.. ఇద్దరిలో ఏ హీరో ప్రజెంటేషన్ బాగుంటుంది ఒకటి అల్లు అర్జున్, రెండు రామ్ చరణ్ అని ప్రశ్న అడిగింది. వెంటనే అనసూయ సుమ కి ఐస్ క్రీం తినిపించటానికి ట్రై చేస్తూ మొత్తం మొహానికి అంటిస్తుంది. అనసూయ కళ్ళు తెరచి చూడగా నోట్లోకి తప్ప అంతా పెట్టావు అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడుతుంది. దీంతో అక్కడున్నవారందరూ ఒక్కసారిగా నవ్వారు. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో సుమ ఇలా డబుల్ మీనింగ్ వచ్చేలా పంచ్ లు కూడా వేస్తోంది. ఎంతో పద్ధతిగా ఉండే సుమ నోటి వెంట ఇలాంటి మాటలు వస్తుండటంతో ఇలాంటి బూతు భాష నీకెందుకని నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.