బిగ్ బాస్ కార్యక్రమంలో అధిక పారితోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

బుల్లితెరపై బిగ్ బాస్ కార్యక్రమం ప్రసారం అవడంతో బిగ్ బాస్ సందడి నెలకొంది. ఇక ఈ కార్యక్రమం ప్రారంభం రోజే బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య చిన్న పార్టీ లవ్ ట్రాక్ లు మొదలు పెట్టాడని తెలుస్తుంది. ఇక ఎంతో ఘనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలోకి 20 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు.ఇకపోతే నేటి నుంచి కంటెంట్ల మధ్య అసలు సిసలైన ఆట మొదలవుబోతుందని తెలుస్తోంది. ఇకపోతే మునుపటి సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో పెద్దగా స్టార్ సెలబ్రిటీలు ఎవరు పాల్గొనలేదని తెలుస్తోంది.

బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అవ్వాలనుకునే వారిని అలాగే చిన్న చిన్న ఆర్టిస్టులను ఈ కార్యక్రమంలోకి తీసుకువచ్చి తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి ఈ కార్యక్రమం ద్వారా భారీగా లాభపడాలని ఆలోచనలో బిగ్ బాస్ నీర్వాహకులు స్టార్ సెలబ్రిటీలను కాకుండా ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకోవాలని తాపత్రయ పడుతున్న వారిని ఈ కార్యక్రమానికి తీసుకువచ్చారు.ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్లకు చాలా తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్లలో అత్యధిక పారితోషికం కేవలం కొంతమందికి మాత్రమే ఇస్తున్నారని మిగిలిన వారందరికీ 10, 20 వేలు చొప్పున రోజుకు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కార్యక్రమం నుంచి ఈ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చిన చలాకి చంటికి మాత్రమే వారానికి మూడు లక్షల చొప్పున అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం.ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కూడా ఇదే స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడం వల్ల ఈయనకు మాత్రమే ఈ కార్యక్రమంలో అత్యధిక రెమ్యూనరేషన్ ఇస్తున్నారని మిగతా అందరికీ కూడా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.