ఫైమాకి బంపర్ ఆఫర్ ఇచ్చిన మల్లెమాల.. ఏంటో తెలుసా..?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ఎంతోమందికి అవకాశాలు కల్పించి సెలబ్రిటీలుగా మార్చింది. ఇలా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన ఎంతోమంది ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు . ఈ క్రమంలో పటాస్ షో ద్వారా ఫేమస్ అయిన ఫైమా జబర్దస్త్ లో అవకాశం దక్కించుకొని లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం పైమా బుల్లెట్ భాస్కర్ టీంలో లీడ్ కంటెస్టెంట్ గా కొనసాగుతోంది. అయితే ఇటీవల బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో అవకాశం రావడంతో ఫైమా జబర్దస్త్ కి దూరమైంది.

సాధారణంగా జబర్దస్త్ నుండి ఒకసారి బయటకు వెళ్లినవారు మళ్లీ ఆ షోలో ఎంట్రీ ఇవ్వటానికి అవకాశం లేదు. ఇలా జబర్దస్త్ ని వీడిన ఎంతోమంది మళ్లీ ఆ షోలో రీ ఎంట్రీ ఇవ్వటానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా మల్లెమాలవారు అందుకు అంగీకరించలేదు. షో రేటింగ్స్ పడిపోయిన కూడా కొత్తవారిని తెచ్చి షో ని ముందుకు నడిపిస్తున్నారు తప్పితే జబర్దస్త్ నుండి బయటికి వెళ్లిన వారికి మాత్రం మళ్లీ అవకాశం ఇవ్వటం లేదు.

అయితే మల్లెమాలవారు ఫైమాకి మాత్రం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో అవకాశం పొందిన ఫైమా ఆ షో నుండి బయటకి వచ్చిన తర్వాత మా టీవీతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ పూర్తయ్యాక మళ్ళీ యధావిధిగా జబర్దస్త్ లో కనిపించడానికి మల్లెమాలవారు ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బిగ్ బాస్ షో నుండి బయటకి వచ్చిన తర్వాత ఎప్పటిలాగే ఫైమా శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ షోలలో సందడి చేయనుంది. అయితే జబర్దస్త్ నుండి బిగ్ బాస్ కి వెళ్లిన మరొక కంటెస్టెంట్ చంటి కి కూడా మల్లెమాలవారు ఇలాంటి ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.