బిగ్ బాస్ సీజన్ 6 లో ఎంట్రీ ఇవ్వనున్న ఆదిరెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

బుల్లితెర చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని భాషలలో ప్రసారం అవుతున్న ఈ రియాలిటీ షో గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులో కూడా ప్రసారమవుతు మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో తొందర్లోనే ఆరవ సీజన్ ప్రారంభం కానుంది. గతంలో ప్రసారమైన బిగ్ బాస్ ఐదు సీజన్లు మంచి రేటింగ్స్ సొంతం చేసుకున్నాయి. అంతే కాకుండ ఇటీవల ఓటిటిలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ కూడా మంచి రేటింగ్స్ తో దూసుకుపోయింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ పూర్తికాక ముందు నుండి ప్రేక్షకులు బిగ్ బాస్ సీజన్ 6 ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎట్టకేలకు ప్రేక్షకుల ఎదురుచూపులు ఫలించి సెప్టెంబర్ 4వ తేదీ నుండి బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్లో సెలబ్రిటీలతో పాటు సామాన్యుల కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. నాగార్జున ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు. ఇక ఇప్పటికే ఈ సీజన్ సిక్స్ లో పాల్గొనే కంటెస్టెంట్ల ఫైనల్ లిస్ట్ రెడీ అయింది. అయితే వారి పేర్లు మాత్రం బయట పెట్టడం లేదు. కానీ సీజన్ సిక్స్ లో పాల్గొని కంటెస్టెంట్ల గురించి బయట అనేక పేర్లు వినిపిస్తున్నాయి. అలా వినిపిస్తున్న వేళలో యూట్యూబర్ ఆదిరెడ్డి కూడా ఒకరు. సామాన్యుల కేటగిరీలో ఆదిరెడ్డి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొననున్నాడు.

అయితే ఆదిరెడ్డి గురించి పూర్తి వివరాలు , అతని బ్యాక్గ్రౌండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిరెడ్డి నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని వరికుంట‌పాడు ప్రాంతానికి చెందిన వాడు. ఇతను ఒక వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన వాడు. నెల్లూరులో డిగ్రీ చదువుతున్న ఆదిరెడ్డి మధ్యలో చదువు ఆపేసి ఆ తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్ళిన ఆదిరెడ్డి ఆ సమయంలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 2 గురించి విశ్లేషిస్తూ ఒక వీడియో చేశాడు. ఈ వీడియోకు మంచి ఆదరణ లభించడంతో వరుసగా బిగ్ బాస్ గురించి వీడియోలు చేస్తూ సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు.

ఇలా బిగ్ బాస్ గురించి రివ్యూ ఇస్తూ ఫేమస్ అయిన ఆదిరెడ్డి యూట్యూబ్లో లక్షల సంఖ్యలో ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. ఇలా యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన ఆదిరెడ్డికి సామాన్యుల కేటగిరీలో సీజన్ సిక్స్ లో పాల్గొనే అవకాశం దక్కింది. గతంలో కూడా ఎంతోమంది యూట్యూబర్స్ బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకోవడం వల్ల మంచి గుర్తింపు పొందారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ గురించి నిత్యం రివ్యూలు రేటింగ్స్ ఇచ్చే ఆదిరెడ్డి కి ఇకపై ఆ అవకాశం లేకుండా బిగ్ బాస్ యాజమాన్యం వారు అతనిని సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా తీసుకెళ్లారు. కొన్ని గంటలలో ప్రసారం కానున్న ఈ సీజన్ సిక్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.