మల్లెమాలతో పోల్చితే బిగ్ బాస్ నుండి ఫైమ ఎంత ఎక్కువ సంపాదిస్తుందో తెలుసా..?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందిన వారిలో ఫైమా కూడా ఒకరు. మొదట ఈటీవీ ప్లస్ లో ప్రసారమవుతున్న అదుర్స్ షోలో సందడి చేసిన ఫైమా అక్కడ మంచి గుర్తింపు రావడంతో జబర్దస్త్ లో ఛాన్స్ కొట్టేసింది. జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన పైమా బుల్లెట్ భాస్కర్ టీం లో మెయిన్ రోల్ చేస్తూ లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం జబర్దస్త్ వల్ల వచ్చిన పాపులారిటీతో ఫైమా బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది.

అయితే ప్రస్తుతం పైమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జబర్దస్త్ కోసం మల్లెమాలవారు ఇచ్చే రెమ్యూనరేషన్ కన్నా బిగ్ బాస్ వారు ఇచ్చే రెమ్యూనరేషన్ అధికంగా ఉండటం వల్ల
ఫైమా జబర్దస్త్ కి స్వస్తి చెప్పి బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జబర్దస్త్ లో లీడ్ రోల్ చేస్తున్న ఫైమా మల్లెమాల వారి నుంచి ఒక రోజుకి దాదాపు లక్ష వరకు పారితోషకం అందుకుంటుంది. ఇలా జబర్దస్త్ లో నెలలో కేవలం పది రోజులు మాత్రమే షూటింగ్ ఉంటోంది. ఇక బయట ఈవెంట్స్ కి వెళ్లినా కూడా మరొక 5 రోజులు గడుస్తున్నాయి. ఇలా మొత్తానికి నెలకి 15 రోజులు మాత్రమే ఫైమా బిజీగా ఉంటుంది.

అందువల్ల బిగ్ బాస్ షో లో అయితే తాను ఉన్నన్ని రోజులు డబ్బు సంపాదించవచ్చు. అదీ కాకుండా బిగ్ బాస్ షో కోసం ఫైమా కి వారానికి రూ. 2.5 లక్షల వరకు పారితోషికం అందుతోంది. అందువల్ల డబ్బు బాగా సంపాదించి జీవితంలో స్థిర పడాలన్న ఉద్దేశంతోనే ఫైమా జబర్థస్త్ కి స్వస్తి చెప్పి బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ చేసింది. అయితే జబర్థస్త్ లో లాగే బిగ్ బాస్ లో కూడా ఫైమా అందరినీ ఆకుంట్టుకుంటుందో లేదో చూడాలి మరి. జబర్థస్త్ వల్ల వచ్చిన గుర్తింపుతో ప్రస్తుతం అందరూ ఫైమాకి సపోర్ట్ చేస్తున్నారు. ముందు ముందు ప్రేక్షకుల నుండి ఈ సపోర్ట్ అలాగే కొనసాగుతుందో లేదో చూడాలి మరి.