ఐదు వారాలకు బిగ్ బాస్ ద్వారా చంటి ఎంత సంపాదించుకున్నారో తెలుసా?

తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే ఐదు వారాలను పూర్తి చేసుకొని ఆరో వారంలో కొనసాగుతోంది.21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నుంచి ఇప్పటికే ఐదు మంది కంటెస్టెంట్ లో ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం 16 మంది కంటెస్టెంట్లతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.ఇకపోతే ఐదవ వారం ఎలిమినేషన్ లో భాగంగా చలాకి చంటి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఐదవ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో ఎక్కువ పాపులారిటీ కలిగిన వారిలో చలాకి చంటి ఒకరు.

ఇలా ఎక్కువ పాపులారిటీ కలిగినటువంటి చలాకి చంటి బయటకు రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే చంటి విషయంలో ఓట్లతో పని లేకుండా చంటి అభిప్రాయం మేరకే బయటకు పంపించారని వార్తలు వస్తున్నాయి. చంటి బిగ్ బాస్ హౌస్ లో ఎంతో డల్ గా ఉన్నారు ఈయన హోమ్ సిక్ కారణంగా సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల తనని ఇంటి నుంచి పంపించినట్టు తెలుస్తుంది.చంటి కూడా ఇదే విషయం నాగార్జున గారితో స్వయంగా వెల్లడించారు. తనని ఇప్పుడు బయటకు పంపించిన వెళ్తానని శనివారం ఎపిసోడ్లో చెప్పేశారు.

ఇలా ఐదవ వారం చంటి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడం జరిగింది.అయితే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చంటికి మల్లెమాలవారు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. అయితే బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లిన చంటి ఈ కార్యక్రమం ద్వారా ఏ స్థాయిలో సంపాదించారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక చంటికి ఒక్క వారానికి 1.5 నుంచి 2లక్షల వరకు రెమ్యూనరేషన్ చెల్లించే విధంగా నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఐదు వారాలకు గాను ఈయన ఏడు నుంచి పది లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకునే ఉంటారని వార్తలు వస్తున్నాయి.