బిగ్ బాస్ లో గీతు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన గీతు రాయల్ కూడా బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది . సోషల్ మీడియాతో పాటు అప్పుడప్పుడు జబర్దస్త్ లో కనిపించే గీతు రాయల్ కి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొనే అవకాశం రావడంతో ఎంతో సంబరపడి టైటిల్ గెలవాలన్న ఆశతో హౌస్ లో అడుగు పెట్టింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో.. బిగ్ బాస్ రూల్స్ ని అతిక్రమిస్తూ తన సొంత రూల్స్ తో గేమ్ ఆడుతూ 9 వారాలపాటు నెట్టుకొచ్చింది.

ఇలా టైటిల్ విన్నర్ గా నిలవాలన్నా కోరికతో పగలు రాత్రి అని తేడా లేకుండా తన బుద్ధిబలంతో గేమ్ ఆడి టైటిల్ దక్కించుకోవాలని కలలు కనింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో గీతు రాయల్ ప్రవర్తించే తీరు.. ఆమె మాట్లాడే మాటలు ప్రేక్షకులకు బాగా చిరాకు తెప్పించాయి. దీంతో గీతు హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వాలని చాలామంది ప్రేక్షకులు కోరుకున్నారు. ఇక ఇటీవల జరిగిన తొమ్మిదవ వారం ఎలిమినేషన్ లో అతి తక్కువ ఓట్లతో గీతు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. అయితే ఇలా ఊహించని విధంగా ఎలిమినేట్ అవ్వటంతో.. గీతు బిగ్ బాస్ వదిలి వెళ్ళనని కన్నీరుగా వినిపించింది.

ఇలా గీతు ఎలిమినేట్ అవ్వడంతో ఇక ఇప్పటినుండి బిగ్ బాస్ షో ని ప్రశాంతంగా చూడవచ్చు అంటు కొందరు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉండగా తొమ్మిది వారాలపాటు లేడీ శివంగిలా టైటిల్ కోసం పోరాడిన గీతు కి బిగ్ బాస్ వారు ఇచ్చిన రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన గీతు కి బిగ్ బాస్ యాజమాన్యం వారు వారానికి రూ1. 25 లక్షల రూపాయలు చొప్పున రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా తొమ్మిది వారాలు హౌస్ కొనసాగిన గీతు కి బిగ్ బాస్ నుండి దాదాపు రూ.11 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.