సోషల్ మీడియా ద్వారా నటి శ్రీ రెడ్డీ నెల సంపాదన ఎంతో తెలుసా…?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి తెలియని వారంటూ ఉండరు. ఇటు సినీ ప్రముఖులు అటు రాజకీయ ప్రముఖులు ఎవరిని కూడా వదలకుండా నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదాలలో నిలుస్తూ ఉంటుంది. హీరోయిన్ కావాలని ఆశతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీరెడ్డి అవకాశాల కోసం కొంతమంది సినీ ప్రముఖుల చేతిలో మోసపోయింది. ఈ క్రమంలో ఇండస్ట్రీలో అర్ధనగ్న ప్రదర్శన చేసి మీటూ ఉద్యమాన్ని ప్రారంభించింది. అప్పటినుండి శ్రీరెడ్డి బాగా పాపులర్ అయింది.

తెలుగులో సినిమా అవకాశాలు రాకపోవటంతో శ్రీ రెడ్డి చెన్నై ఇండస్ట్రీకి వెళ్ళిపోయి అక్కడ మంచి మంచి అవకాశాలు అందుకుంటుంది. అయితే టాలీవుడ్ లో సినిమా అవకాశాలు రాకపోయినా శ్రీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి యూట్యూబ్ ద్వారా భారీ స్థాయిలో ఆదాయం పొందుతుంది. ఇక ఈ మధ్యకాలంలో శ్రీ రెడ్డి తన రూటు మార్చి వంటలు వీడియోలు చేస్తూ మరింత పాపులర్ అయ్యింది. ఇలా యూట్యూబ్ వీడియోస్ ద్వారా శ్రీరెడ్డి నెల తిరిగేసరికి దాదాపు 7 నుండి 8 లక్షల వరకు ఆదాయం పొందుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

అయితే శ్రీ రెడ్డి పెట్టే ఖర్చులు కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీ రెడ్డి హీరోయిన్లతో సమానంగా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ నెలకి దాదాపు నాలుగు లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. హీరోయిన్ కావాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీరెడ్డి తన కళ నెరవేరకపోయినా కూడా యూట్యూబ్ వీడియోస్ ద్వారా లక్షల సంఖ్యలో ఫాలోవర్లను పెంచుకొని భారీగానే ఆదాయం సంపాదిస్తోంది. యూట్యూబ్లో శ్రీరెడ్డి షేర్ చేసే ఏ వీడియో అయినా క్షణాలలో వైరల్ అవుతూ ఉంటుంది.