ఐరన్ లెగ్ లకు లైఫ్ ఇచ్చిన ఘనత శ్యాంప్రసాద్ రెడ్డిది.. వాడు పెద్ద గొట్టం: గీతాకృష్ణ

కిరాక్ ఆర్పి మల్లెమాల వారి గురించి చేసిన వ్యాఖ్యలు రోజురోజుకు తీవ్ర వివాదంగా మారుతున్నాయి.ఈయన మల్లెమాల వారి గురించి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు పై పలువురు జబర్దస్త్ కమెడియన్స్ స్పందించగా ప్రస్తుతం డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ తీవ్రంగా ఆర్పి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.ఈ క్రమంలోనే ఆర్పి చేసిన వ్యాఖ్యలపై డైరెక్టర్ గీతాకృష్ణ స్పందించారు.ఈ సందర్భంగా గీతాకృష్ణ మాట్లాడుతూ తాను శ్యాంప్రసాద్ రెడ్డి ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నామని తను చాలా మంచివాడు అంటూ చెప్పుకొచ్చారు.

ఇకపోతే ఈటీవీ రేటింగ్స్ పూర్తిగా పడిపోయిన సమయంలో శ్యాం ప్రసాద్ రెడ్డి ఈ రియాలిటీ షో ద్వారా ఈటీవీ రేటింగ్స్ అమాంతం పెరిగిపోయాయని గీత కృష్ణ వెల్లడించారు.ఈ కార్యక్రమాల ద్వారా శ్యాం ప్రసాద్ రెడ్డి ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కిరాక్ ఆర్పి గొప్ప స్థాయిలో ఉన్నారు కానీ ఆయన వల్ల జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదని చెప్పారు.ఇకపోతే ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకున్న నాగబాబు రోజా వంటి వారికి కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా లైఫ్ ఇచ్చారు.

ఇలా ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పూర్తిగా తప్పు. అంత పెద్ద సంస్థలో ఫుడ్ బాగోలేదని సాంబార్ బాగోలేదు అనడం ఏంటి. ఆర్పి పెద్ద గొట్టం గాడు.. అతను బాగా లేదంటేనే జబర్దస్త్ కార్యక్రమానికి మల్లెమాలవారికి పెద్ద నష్టమేమీ లేదు. ఇలా ఆర్పి చేసిన ఈ వ్యాఖ్యల వల్ల శాంప్రసాద్ రెడ్డికి ఏ విధమైనటువంటి నష్టం లేదని ఈ సందర్భంగా గీత కృష్ణ ఆర్పీ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.