నువ్వు ఆడా? మగా? అంటూ మరొకసారి అందరి ముందు వర్ష పరువు తీసిన ఇమ్మూ?

జబర్దస్త్ షో ద్వారా ఎన్నో జంటలు పాపులర్ అయ్యాయి. మొదట సుధీర్ రష్మి మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేసిన మల్లెమాల ఆ తర్వాత కూడా ఇదే మెథడ్ ఫాలో అయింది. అయితే సుధీర్ రష్మీ అంత కాకపోయినా వీరిద్దరూ కూడా బాగానే ఫేమస్ అయ్యారు. ఇలా ఇద్దరూ జబర్దస్త్ లో లవర్స్ గా, భార్యాభర్తలుగా స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా ఈటీవీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలలో కూడా ఈ జంట తెగ సందడి చేస్తోంది.

ఇదిలా ఉండగా వర్ష పర్సనాలిటీ మీద ఇమాన్యుల్ ఎన్నోసార్లు పంచులు వేస్తుంటాడు . ఇంతకీ నువ్వు ఆడ? మగ ? అంటూ అవమానించేలా మాట్లాడుతుంటాడు. దీంతో ప్రేక్షకులు కూడా సోషల్ మీడియా వేదికగా వర్షని ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటారు. దీంతో ఒకసారి వర్ష ఈ విషయంపై స్పందిస్తూ ఫుల్ సీరియస్ అయింది. ఇక ఈవారం ప్రసారం కాబోతున్న జబర్దస్త్ ఎపిసోడ్ లో కూడా వీరిద్దరూ సందడి చేశారు.

ఈ ఎపిసోడ్ లో బుల్లెట్ భాస్కర్ టీం లో చేసిన ఈ జంట స్కిట్ లో భాగంగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బంగారం అనే రీల్ తీసుకొని … బంగారం అందరూ అడుగుతున్నారు అని వర్ష కామెడీ చేయటానికి ప్రయత్నించగా , ఇమాన్యుల్ స్పందిస్తూ..ఏమని అడుగుతున్నారు.. నువ్ ఆడనా?మగనా? అనా అంటూ ఇమాన్యుయేల్ అందరి ముందు వర్ష పరువుతీశాడు. ఇమాన్యుల్ ఇలా అనగానే వర్ష తన మొహం పక్కకు తిప్పుకుంది. అయితే అక్కడున్న వారు మాత్రం ఇమాన్యుల్ వేసిన పంచ్ కి ఒక్కసారిగా నవ్వారు.