బాలయ్య టాక్ షోలో ప్రభాస్ ఎక్కువగా వాడిన ఈ పదాన్ని గమనించారా.. ప్రభాస్ ఊతపదం ఇదేనా?

బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహాలో ప్రసారమవుతున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎలాంటి ఆదరణ పొందిందో మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి ఎంతో మంది సెలబ్రిటీలను ఆహ్వానించి బాలయ్య వారిని ప్రశ్నించే విధానం ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇలా మొదటి సీజన్ ఎంతో విజయవంతంగా పూర్తి కావడంతో అంతకుమించి ఉండేలా రెండవ సీజన్ కూడా ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అలాగే మరొక హీరో గోపీచంద్ కూడా హాజరయ్యారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని నుంచి విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ను ఒక టాక్ షోలో ఇలా చూడటంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ ను బాలకృష్ణ వేదికపై ఆహ్వానించినప్పటి నుంచి ఈ ప్రోమోలో ఆయన ఎక్కువసార్లు ఒకే పదాన్ని ఉపయోగించారు. ప్రభాస్ ఈ కార్యక్రమంలో ఎక్కువగా ఒరేయ్ ఒరేయ్ అనే పదాన్ని ఎక్కువగా వాడినట్లు మనం గమనించవచ్చు.

రామ్ చరణ్ కు ఫోన్ చేసిన ప్రభాస్ ఒరేయ్ చరణ్ నువ్వు స్నేహితుడిగా శత్రువివా అంటూ మాట్లాడారు.అలాగే గోపీచంద్ ఎంట్రీ ఇవ్వగానే రాణి గురించేనా అనడంతో సర్ మీరు పక్కకు తప్పుకోండి అంటూ ఒరేయ్ అని గోపీచంద్ పై సటైస్ వేశారు అలాగే మరొక సందర్భంలో కూడా గోపీచంద్ ను ఉద్దేశిస్తూ ఒరేయ్ అంటూ మాట్లాడారు.ఇలా మాటిమాటికి ప్రభాస్ ఒరేయ్ అనే పదం ఉపయోగించడంతో ప్రభాస్ ఊతపదం ఇదేనా అంటూ అభిమానులు ఈ పదాన్ని ట్రెండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రోమో నే ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది మరి పూర్తి ఎపిసోడ్ ఎలా ఉండబోతోంది అనే విషయం గురించి ఆత్రుత నెలకొంది.