రష్మికి చెప్పకుండా ఆ సినిమాలో లిప్ లాక్ సీన్స్ చేశారా?

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మీ ఒకానొక సమయంలో వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించారు.ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన రష్మికి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో గుంటూరు టాకీస్ చిత్రంలో హీరోయిన్ గా సందడి చేశారు. ఇలా ఈ సినిమాతో ఈమె ఒక్కసారిగా ఫేమస్ అయినప్పటికీ తనకు తిరిగే లాంటి అవకాశాలు రాలేదు. ఈ సినిమాలో రష్మీ కావలసినంత హాట్ పర్ఫామెన్స్ చేసిందని చెప్పాలి.

ఈ సినిమాలో ఈమె హీరోతో లిప్ లాక్ సన్నివేశాలు విపరీతమైన క్రేజ్ తీసుకువచ్చాయి. అయితే దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ఈ విషయం రష్మీకి చెప్పకుండా తనతో లిప్ లాక్ చేయించారని వార్తలు గతంలో వినిపించాయి అయితే ఈ వార్తలపై రష్మీ స్పందిస్తూ తనకు చెప్పకుండా ఎలాంటి సన్నివేశాలను చిత్రీకరించలేదని డైరెక్టర్ ముందుగా తనకు ఈ సన్నివేశాన్ని వివరించడంతో ఆ సన్నివేశానికి లిప్ లాక్ అవసరం అనిపించే చేసామని క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమా తర్వాత రష్మికి మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయని భావించినప్పటికీ ఈమెకు మాత్రం వెండితెరపై పెద్దగా గుర్తింపు సంపాదించిన సినిమాలు కానీ పాత్రలు కానీ రాలేదు. వెండితెర తనకు కలిసి రాకపోవడంతో ఈమె బుల్లితెరపై తన హవా కొనసాగిస్తుంది. బుల్లితెర కార్యక్రమాల ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించు రష్మీ ప్రస్తుతం వరుస కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు.