జబర్దస్త్ వాళ్ళు పొమ్మనలేక చంటికి పొగ పెట్టారా… అందుకే బిగ్ బాస్ కి వెళ్ళారా?

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం సీజన్ 6 ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ ఆటపాటల నడుమ ఈ కార్యక్రమం ఎంతో సందడిగా కొనసాగుతూ ఒక్కొ కంటెస్టెంట్ హౌస్ లోకి వెళ్లి సందడి చేశారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో ఫేమస్ అయినటువంటి చలాకి చంటి కూడా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఇక చలాకి చంటి బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లే ముందు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి రావడం పై స్పందించారు. తను ఎప్పటికైనా నాగార్జునతో చంటి అని పిలిపించుకోవడం కోసం ఎదురుచూస్తున్నానని ఎప్పటినుంచో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎదురుచూస్తున్నాను అయితే తెలుగు తెలిసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు నాకు సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా చలాకి చంటి తెలిపారు.బిగ్ బాస్ కార్యక్రమానికి ఈయన వెళ్లడంతో మల్లెమల వారు నిర్వహిస్తున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమంలో తనకు ఎదురైన చేదు సంఘటనల గురించి ఈ సందర్భంగా బయటపెట్టారు.

జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్న సమయంలో మల్లెమాల వారు ఇచ్చే రెమ్యూనరేషన్ తనకి సరిపోలేదని, అయితేతాను చాలా రిక్వెస్ట్ గా తనకు రెమ్యూనరేషన్ పెంచాలని అడిగినప్పుడు నీ మొహానికి ఇదే ఎక్కువ అంటూ తనని చాలా అవమానకరంగా మాట్లాడారని చంటి పేర్కొన్నారు. ఇకపోతే తాను ఏ విషయంలోనైనా చాలా ముక్కుసూటిగా మాట్లాడతానని అందుకే తనకి కోపిష్టి, పొగరు ఆటిట్యూడ్ అనే ముద్ర తనపై వేశారని, జబర్దస్త్ నుంచి నన్ను బయటకు పంపించడం కోసమే ఇవన్నీ కారణమయ్యాయని ఈ సందర్భంగా చంటి జబర్దస్త్ కార్యక్రమంలో తనకు జరిగిన చేదు సంఘటనల గురించి బయటపెట్టారు.