ప్రాజెక్ట్ హెడ్ గా వసుధారను గెలిపించిన దేవయాని… షాక్ లో వసుధార!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న గుప్పెడంత మనసు సీరియల్ నేడు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే వసుధారను ప్రాజెక్ట్ హెడ్ గా నియమించడం కోసం రిషి ప్రత్యక్ష ఓట్ల నియామకాన్ని ప్రకటిస్తాడు. దీంతో వసుధారకు కొందరు అనుకూలంగా కొందరు వ్యతిరేకంగా ఓట్లు వేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జగతికి వీడియో కాల్ చేసి తన ఓటు వసుధారకు వేయమని చెబుతుంది. రిషి ఫణీంద్ర మహేంద్ర అందరు కూడా వసుధారకు అనుకూలంగా ఓటు వేయగా కొందరు లేడీ లెక్చరర్స్ ఇతరులు మాత్రం వసుధారకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు.

ఇలా వసుధారకు వ్యతిరేకంగా ఆరు సానుకూలంగా ఆరు ఓట్లు రావడంతో టైం అయింది అయితే ఇలా టై అయిన తర్వాత ఏం చేయాలి అనే విషయాన్ని మినిస్టర్ గారిని అడగాలేమో అంటూ ఉండగా అంతలోపు అక్కడికి దేవయాని వచ్చి ఏం అవసరం లేదు రిషి అంటుంది. తాను కూడా బోర్డు మెంబర్ కనుక తనకు ఓ టు వేసే అవకాశం ఉందని వెళ్తుంది. అయితే దేవయాని వసుధారను కచ్చితంగా గెలవనివ్వదని అందరూ భావిస్తూ ఉంటారు. ఇలా కొంత సమయం పాటు అందరికీ కంగారు పెట్టిన దేవయాని చివరికి వసుధారకు ఓటు వేసి గెలిపిస్తుంది.

ఈ విధంగా వసుధారకు అనుకూలంగా ఓటు వేసి దేవయాని తనని గెలిపించడంతో పసుధార అలాగే మహేంద్ర షాక్ అవుతారు. రిషి మాత్రం థాంక్యూ సో మచ్ పెద్దమ్మ మీరు వసుధారని గెలిపించారు. చూసావా వసుధార పెద్దమ్మ మనసు ఎంత మంచిదో అంటూ రిషి తనని పొగుడుతాడు. ఇక అక్కడ అందరూ వెళ్లిపోవడంతో రిషి తనకు కంగ్రాట్యులేషన్స్ చెబుతూ పార్టీ లేదా అని అడగడమే కాకుండా జగతి మేడం లాగా నువ్వు కూడా ఈ ప్రాజెక్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలి వసుధార అని చెబుతాడు.

మరోవైపు దేవయాని లెక్చరర్స్ దగ్గరికి వెళ్ళగా అదేంటి మేడం వసుధార ఓడిపోవాలని మమ్మల్ని ఉసిగొలిపి చివరికి మీరు వచ్చి తనని గెలిపించారు అంటూ అడగడంతో దేవయాని ఇక్కడ గెలిచింది వసుధార కాదు నేను.రిషికి అన్నీ నేనే రిషి ఆ స్థానంలో వసుధార ఉండాలనుకున్నాడు కనుక నేను రిషిని గెలిపించాననీ, రిషి కోసం దేనినైనా చేస్తానని నమ్మించాను అంటూ దేవయాని తన ఎత్తుగడలను చెబుతుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.