త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న దీపికా రంగరాజు.. పెళ్ళికొడుకు ఎవరంటే!

బ్రహ్మముడి సీరియల్ లో హీరో రాజ్ అలియాస్ మానస్ నాగులపల్లి తో సమానంగా పేరు సంపాదించుకున్న నటి కావ్య అలియాస్ దీపికా రంగరాజు. ఆత్మగౌరవం ఉన్న అమ్మాయిగా కుటుంబ బాధ్యతలని బరువు అనుకోకుండా మోస్తూ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది దీపిక. బెంగాలీ సీరియల్ గట్చోరా సీరియల్ కి రీమేక్ అయిన బ్రహ్మముడి సీరియల్ ఇక్కడ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవటం విశేషం.

1996లో తమిళనాడులోని చెన్నైలో పుట్టిన దీపిక ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత న్యూస్ రీడర్ గా కెరియర్ని ప్రారంభించింది తర్వాత 2019లో తమిళ చిత్రం ఆరడి సినిమాతో వెండితెరపై అడుగు పెట్టింది. ఆపై చితిరం పెసుతడి సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు వాళ్ళకి పరిచయమైన దీపిక తన నటనతోనే కాకుండా తన ప్రవర్తనతో కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది.

టీవీ ప్రోగ్రామ్స్ లోని, గేమ్ షోస్ లోని ఆమె వచ్చి రాని తెలుగులో మాట్లాడే మాటలు, చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే ఈ బ్రహ్మముడి సీరియల్ నటి మెడలో త్వరలోనే బ్రహ్మముడి పడబోతుందంట. ఒక సీరియల్ నటుడితో ప్రేమలో పడిందట ఈ భామ, ఈ విషయం తల్లిదండ్రులతో చెబితే వారు కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారంట. ఇంకేముంది త్వరలోనే అమ్మడి మెడలో బ్రహ్మముడి పడిపోతుంది అంటూ వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.

అప్పుడే దీపిక ఫ్యాన్స్ ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరా అని ఆరాలు తీసే పనిలో ఉన్నారు. అయితే దీపిక పెళ్లి విషయంపై సోషల్ మీడియాలో రచ్చ జరగటమే కానీ ఈ విషయంపై అటు దీపిక గాని ఆమె పేరెంట్స్ గాని ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అలాగే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకి ఎలాంటి స్పందనా తెలియజేయలేదు. ఇక బిగ్ బాస్ లోకి వెళ్లడం తన కోరిక అని చెప్పే దీపిక కోరిక త్వరలోనే తీరాలని కోరుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్.