జబర్దస్త్ కి అనసూయా గుడ్ బై.. అనసూయని నిలదీసిన చంటి..?

బుల్లితెర గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి తెలియని వారంటూ ఉండరు. మొదట న్యూస్ రీడర్గా తన కెరీర్ ప్రారంభించిన అనసూయ జబర్దస్త్ ద్వారా యాంకర్ గా బాగా పాపులర్ అయింది. జబర్దస్త్ లో యంకరింగ్ తో పాటు తన అందాలతో కూడా బుల్లి తెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ ఇచ్చే గ్లామర్ ట్రీట్ అంతా ఇంతా కాదు. ఇలా బుల్లితెర మీద ఎన్నో టీవీ షోస్ లో తన గ్లామర్ తో ఆకట్టుకున్న అనసూయ వెండితెర మీద కూడా నటించే అవకాశాలను దక్కించుకుంది. సినిమాలలో మాత్రం అనసూయ గ్లామర్ కు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా మంచి గుర్తింపు పొందింది.

రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయ అప్పటినుండి రంగమ్మత్తగా మంచి గుర్తింపు పొందింది. ఇటీవల పుష్ప సినిమాలో తన విలక్షణ నటనతో అనసూయ వెండితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలలో నటిస్తూ ఒకవైపు టీవీ షోస్ లో యాంకరింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం అనసూయ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఇలా బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ మాత్రమే కాకుండా డిజిటల్ స్క్రీన్ మీద కూడా అనసూయ తన సత్తా నిరూపించుకోబోతోంది. ఇలా సినిమాలలోవరుస అవకాశాలు రావడంతో అనసూయ జబర్దస్త్ స్వస్తి చెప్పనుంది అంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఆ వార్తలు నిజమయ్యాయి.

ఈవారం ప్రసారం కాబోయే జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది ఈ ప్రోమోలో అనసూయ గురించి స్కిట్ వేశారు. ఈ స్కిట్ లో అనసూయ మీద కొన్ని పంచ్ లు కూడా పడ్డాయి. జబర్దస్త్ కోసం అనసూయ తన పిల్లలను తల్లి వద్ద వదిలి జబర్దస్త్ షో కోసం పడిన కష్టాల గురించి కూడా గుర్తు చేశారు. అయితే అనసూయ జబర్థస్త్ కి గుడ్ బై చెప్పటంతో అక్కడున్న వారు కొంచం ఎమోషనల్ అయ్యారు. ఇంద్రజ గారు కూడా ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ క్రమంలో చలాకి చంటి అనసూయ గురించి మాట్లాడుతూ … జబర్థస్త్ కోసం నెలలో మూడూ రోజులు సమయం కేటించలేవా ? అంటూ ప్రశ్నించాడు. అందుకు అనసూయ కుదరదు అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టింది. మొత్తానికి అనసూయ ఎంతో సంతోషంగా అందరికీ గుడ్ బై చెప్పింది.