చలాకి చంటిని బిగ్ బాస్ కి వెళ్లకుండా అడ్డుపడిన మల్లెమాల.. అదే కారణమా..?

బుల్లితెర మీద ప్రసారమవుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు బిగ్ బాస్ రియాల్టీ షో. ఎన్నో ఎళ్లుగా ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకొని ఇటీవల ఆరవ సీజన్ కూడా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఎంతోమంది సెలబ్రిటీలు సామాన్యులు బిగ్ బాస్ లో అవకాశం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి బిగ్ బాస్ షో లో అడుగుపెడితే డబ్బులతో పాటు మంచి గుర్తింపు కూడా వస్తుందన్న ఆశతో చాలమంది బిగ్ బాస్ షో లో అవకాశం కోసం ఎదురుచూస్తారు. అయితే మరికొంతమంది సెలబ్రిటీలు మాత్రం జీవితంలో పొరపాటున కూడా బిగ్ బాస్ షో కి వెళ్ళమని తెగేసి చెబుతున్నారు.

బిగ్ బాస్ సీజన్ 6 లో అవకాశం దక్కించుకున్న చంటికి కూడ బిగ్ బాస్ షో నుండి గతంలో మూడు సీజన్లకు ఆఫర్ వచ్చింది. కానీ చంటి మాత్రం ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసాడు. కానీ ఇప్పుడు సీజన్ 6 కోసం వచ్చిన ఆఫర్ ని మాత్రం చంటి వదులుకోలేదు. ప్రస్తుతం చంటి సినిమాలతో పాటు జబర్థస్త్ లో కూడా సందడి చేస్తున్నాడు. అయితే బిగ్ బాస్ షో నుండి ఆఫర్ వచ్చిందని చెప్పగానే మల్లెమాల వారు అందుకు నిరాకరించినట్లు చంటి వెల్లడించారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొన్న చంటి అనేక ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.

ఈ క్రమంలో చంటి మాట్లాడుతు..” నేను జబర్దస్త్‌ షో లో మొదటినుండి కొనసాగుతున్నాను. బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చిందని మల్లెమాల టీమ్‌కు చెప్పగానే వాళ్లు నో చెప్పారు. జబర్థస్త్ లో సీనియర్‌గా కొనసాగుతున్న నేను ఇప్పుడు సడన్‌గా వదిలేసి వెళ్లిపోవటం మంచిది కాదని, ఒకసారి ఆలోచించండి అంటూ నాకు నచ్చచెప్పటానికి ప్రయత్నించారు. కానీ కొన్ని భాద్యతలు నెరవేర్చటానికి నాకు డబ్బు అవసరం ఉంది . అందుకే బిగ్ బాస్ కి వెళ్తానని చెబితే కావాలంటే మనం వేరే షోలు ప్లాన్‌ చేద్దాం అన్నారు. అయినా నేను ఒప్పుకోకుండా బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన వెంటనే మళ్ళీ జబర్థస్త్ కి వస్తానని చెప్పటంతో మల్లెమాల వారు ఒప్పుకున్నారని చంటి వెల్లడించాడు. ప్రస్తుతం మల్లెమాల వారితో తనకి అగ్రిమెంట్ లేనందున అవినాష్ లాగా డబ్బు చెల్లించే అవసరం లేదని చెప్పుకొచ్చాడు.