ఎక్కడ మొదలెట్టావో అక్కడికే వచ్చావ్.. యాంకర్ రవి పరువుదీసిన చలాకీ చంటి

యాంకర్ రవి కెరీర్ ఎక్కడ ఎలా మొదలైందో అందరికీ తెలిసే ఉంటుంది. మా మ్యూజిక్ షోలో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి.. లాస్యతో కలిసి చేసిన సంథింగ్ స్పెషల్ అనే షో ఓరేంజ్‌లో పాపులర్ అయింది. వీధి వీధి తిరిగి చేసిన ప్రోమోలు, అప్పట్లో వారు చేసిన ప్రమోషనల్ సాంగ్స్ ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి. ఏకంగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే అంత కెమిస్ట్రిని వర్కవుట్ చేశారు. అలా ఇద్దరూ బాగానే ఫేమస్ అయ్యారు.

Chalaki Chanti Satires On ANchor Ravi In Jatharo Jathara
Chalaki Chanti Satires On ANchor Ravi In Jatharo Jathara

రవి లాస్య అనే జంట బుల్లితెరపై ఓ ముద్ర వేసింది. ఆ తరువాత రవి ఈటీవీలోకి వెళ్లడం పటాస్ షోతో మరింత పాపులర్ అవ్వడం రవి శ్రీముఖి అనే జంట మరో లెవెల్‌కు వెళ్లడంతో స్టార్డం వచ్చేసింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఏకంగా వెండితెరపై హీరోగా చాన్స్ కొట్టేశాడు. కానీ రవికి బుల్లితెరే కలిసి వచ్చింది. యాంకర్, హోస్ట్‌గానే రవికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా దసరా ఈవెంట్‌లో భాగంగా స్టార్ మాలో మెరిశాడు.

స్టార్ మా దసరా ఈవెంట్ జాతరో జాతరలో తారలంతా దుమ్ములేపుతున్నారు. అందులో యాంకర్‌గా రవి ఎంట్రీఇచ్చాడు. చలాకీ చంటి రవి గతాన్ని గుర్తుకు చేశాడు. ఎక్కడ మొదలుపెట్టావో చివరకు అక్కడకే వచ్చావని గుర్తు చేశాడు. మా టీవీలో మొదలుపెట్టి ఈ టీవీలో ఎదిగి జీ తెలుగులో సెటిలై మళ్లీ స్టార్ మాలో ఈవెంట్‌కు వచ్చాడని చెప్పకనే చెప్పేశాడు. దీంతో రవి కూడా ఓ క్షణం పాటు షాక్ అయ్యాడు.