బుల్లితెర పై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే ఈ కార్యక్రమం తెలుగులో ఐదు సీజన్లను పూర్తిచేసుకుని ఆరవ సీజన్ ప్రసారం అవ్వడానికి సిద్ధమవుతోంది.ఇక ఆరవ సీజన్ కూడా సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రసారం కాబోతుందని ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు ప్రోమో ద్వారా వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమం ప్రసార తేదీని కూడా ప్రకటించడంతో ఈ కార్యక్రమం పై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ పెద్ద ఎత్తున కొందరి పేర్లు వినపడుతున్నాయి.
ఇకపోతే ఈ కార్యక్రమంలోకి సింగర్ మోహన భోగరాజు వెళ్తున్నారని వార్తలు రావడంతో ఈ వార్తలపై ఆమె స్పందించి తాను వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు.ఇదిలా ఉండగా బిగ్ బాస్ కార్యక్రమంలోకి చలాకి చంటి వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలు పై చలాకి చంటి కాస్త భిన్నంగా స్పందిస్తూ అసలు విషయం వెల్లడించారు. బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లడానికి నిర్వాహకులతో ఇప్పటికే అన్ని విషయాలలోనూ చర్చలు పూర్తి అయ్యాయని తెలిపారు.
ఇక బిగ్ బాస్ నిర్వాహకులు కేవలం రెండు విషయాలలో తనకు క్లారిటీ ,ఈ రెండు విషయాలలో క్లారిటీ వస్తే తాను బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్తానని తెలిపారు. మరి బిగ్ బాస్ నిర్వాహకులు చలాకి చంటి ఆ రెండు కండిషన్లకు ఒప్పుకుంటారా.. చంటి బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్తారా అనే విషయం గురించి తెలియాల్సి ఉంది.ఇకపోతే ఈ కార్యక్రమానికి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక బజ్ కార్యక్రమానికి శివ యాంకర్ గా వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.