వసుదారని చీ కొట్టిన చక్రపాణి…. రిషికి అబద్ధం చెప్పిన వసుధార!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా మారింది. నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… వసుధార తన తల్లిని చూసి ఆప్యాయంగా తనని హత్తుకొని ఏడుస్తుంది. అదే విధంగా తన తండ్రి చక్రపాణి వద్దకు వెళ్లి నేను యూనివర్సిటీ టాపర్గా వచ్చాను నన్ను ఆశీర్వదించండి అని కాళ్ళపై పడగా తన తండ్రి మాత్రం ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటూ తనని ద్వేషిస్తాడు. పెళ్లి పీటల పైనుంచి నువ్వు లేచిపోవడంతో నేను వీధిలో కూడా నడవడానికి కూడా వెనకడుగు వేస్తున్నాను ఫలానా చక్రపాణి కూతురు పెళ్లి పీటలపై నుంచి లేచిపోయిందని ఊరంతా మాట్లాడుతుంటే చర్చి బతుకుతున్నాను నువ్వు పాస్ అయితే ఎవరికి కావాలి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ తనని తిడతాడు.

ఇలా వసుధార తండ్రి చక్రపాణి తనని తిడుతున్నప్పటికీ తన తల్లి సుమిత్ర అడ్డుకోవడానికి ప్రయత్నించిన చక్రపాణి తన మాట వినడు.ఇలా వసుధారణ అక్కడ నుంచి చక్రపాణి వెళ్ళిపోగా, వసుధార మాత్రం తన తల్లి ఒడిలో పడుకొని చూడమ్మా నేను యూనివర్సిటీ టాపర్ యూత్ ఐకాన్ గా నిలిచాను. నేను అక్కడ ఉన్న ప్రతిక్షణం మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఫోన్ చేసి మాట్లాడాలి అంటే నాన్న ఎక్కడ తిడతారో అని భయపడేదాన్ని అంటూ చెబుతుంది.అక్కడ నేను చదువుకోవడం నా లక్ష్యం కోసం ఎన్ని ఉద్యోగాలు చేశాను ఎన్ని కష్టాలు పడ్డాను నీకేం తెలుసమ్మా అని బాధపడుతుంది.

ఈ క్రమంలోనే యూనివర్సిటీ టాపర్ గా తాను గెలుచుకున్న ట్రోఫీ చూపిస్తూ ఉండగా చక్రపాణి వచ్చి దానిని విసిరి కొడతాడు.నిన్ను ఇంట్లో నుంచి వెళ్లమని చెప్పాను కదా మరి ఇక్కడ ఎందుకు ఉన్నావని తిడతాడు నువ్వు యూనివర్సిటీ టాపర్గా గెలిస్తే నాకేంటి నువ్వు ఆరోజు పెళ్లి పీటలపై నుంచి లేచి వెళ్లిపోవడంతో ఆడపిల్లలకు పెళ్లి చేయడం చేతకాక నేనే పంపించానని తల ఒక మాట అంటున్నారు.ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చి మరోసారి ఊర్లో అందరూ మాట్లాడడానికి అవకాశం ఇచ్చావు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తనని తిడుతూ ఉంటాడు.

నువ్వు ఏ రోజైతే ఈ పెళ్లి పీటలపై నుంచి లేచిపోయావో ఆరోజు నువ్వు చచ్చిపోయావు అని అనుకున్నాను ఇలాంటి దౌర్భాగ్యారాలు నా కడుపున పుట్టినరోజు చనిపోయి ఉంటే బాగుండేది అని తనని తిడుతూ ఉంటాడు.మరోవైపు రిషి వసుధార ఊరు మొత్తం తిరిగి ఒక హోటల్ కి వెళ్లి రూమ్ కావాలని అడిగి రూమ్ లో ఉంటాడు. అక్కడికి వెళ్లిన రీషి వసుధార గురించి ఆలోచిస్తూ తనకు ఫోన్ చేస్తూ ఉన్నప్పటికీ వసుధార మాత్రం తన తండ్రితో మాట్లాడుతూ ఫోన్ లిఫ్ట్ చేయదు.

వసుధార ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రిషి కోప్పడతాడు ఎందుకు వసుధార నన్ను ఇలా బాధ పెడుతోంది. నేను తన ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటానని తనకు తెలుసు కదా అని అనుకుంటూ ఉంటాడు. అయితే వసుధార తన వద్దకు వచ్చినట్లు రిషి ఊహించుకుంటాడు. అయితే అది తన ఊహ అని తెలిసి మరోసారి వసుధారకు ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అక్కడ అంతా బానే ఉంది కదా అని అడుగుతాడు.ఇక్కడ అంతా బానే ఉంది సార్ నేను యూనివర్సిటీ టాపర్గా వచ్చినందుకు మా నాన్న చాలా సంతోషించారు.అంటూ అబద్ధాలు చెబుతూ బాధపడుతుంది నన్ను క్షమించండి సార్ మీతో అబద్ధం చెప్పాను అని మనసులో అనుకొని అమ్మ పిలుస్తుంది. తర్వాత మాట్లాడుతానని ఫోన్ పెట్టేస్తుంది.