క్యాష్ షో వల్లనే మల్లెమాలవారికి లాభమా… జబర్దస్త్ వల్ల లాభాలు లేవా?

ఈటీవీ ఛానల్ రియాలిటీ షోలకు కేరాఫ్ అడ్రస్ గా ఉందని చెప్పటంలో సందేహం లేదు. ఎందుకంటే ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ కన్నా టీవీ షోలకే ఎక్కువ రేటింగ్స్. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ, క్యాష్, జాతి రత్నాలు వంటి రియాలిటీ షోలకి మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఈ రియాలిటీ షో ల వల్ల మల్లెమాలవారికి భారీ స్థాయిలో ఆదాయం ఉన్నట్లు తెలుస్తోంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో పాటు సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న క్యాష్ షో వల్ల కూడా మల్లెమాలవారికి అధిక ఆదాయం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈటీవీలో ఎన్నో ఏళ్లుగా ప్రసారమవుతున్న క్యాష్ షో కి సుమ యాంకర్ గా వ్యవహరిస్తుంది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలతో పోలిస్తే క్యాష్ షో కి కూడా అధిక మొత్తంలో ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షో ల కోసం ఎక్కువమంది కమెడియన్స్ ని తీసుకోవడమే కాకుండా భారీగా సెట్ అప్ అవసరం ఉంటుంది. అందువల్ల ఈ షోలకు ఆదాయంతో పాటు ప్రొడక్షన్ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ క్యాష్ షో కోసం కమెడియన్లను భారీ సెట్ ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈ షో కండక్ట్ చేయడానికి ప్రొడక్షన్ ఖర్చు తక్కువగా ఉంటుంది.

అంతేకాకుండా జబర్దస్త్ షూటింగ్ కోసం కమెడియన్స్ అందరిని హైదరాబాద్ కి తరలించాల్సి ఉంటుంది. కానీ క్యాష్ షూటింగ్ మాత్రం రామోజీ ఫిలిం సిటీలో జరగటం వల్ల ఈ ఖర్చు కూడా కలిసొస్తుంది. ఇక క్యాష్ షోలో పాల్గొనేవారు ఆ షో కి గెస్ట్లుగా వస్తారు. అందువల్ల వారికి రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా సినిమా ప్రమోషన్స్ కోసం క్యాష్ షోలో ఎక్కువ మంది సెలబ్రిటీలు సందడి చేస్తూ ఉంటారు. ఇలా సినిమాని ప్రమోట్ చేయడానికి సినిమా నిర్మాతలు మల్లెమాలవారికి డబ్బులు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇక రేటింగ్స్ కూడా ఆ రెండు షోలకి సమానంగానే క్యాష్ షో కి కూడా వస్తాయి. అందువల్ల జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలతో పోలిస్తే క్యాష్ వల్ల మల్లెమాలవారికి అధిక ఆదాయం ఉన్నట్లు తెలుస్తోంది.