నాటీ ఆంటీ అంటూ అందరి ముందు సుమ పరువు తీసిన బ్రహ్మాజీ.. సుమ రియాక్షన్ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకవైపు టీవీ షోలలో యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉండే సుమ మరొకవైపు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో హోస్ట్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అంటే అందులో కచ్చితంగా సుమ ఉండాల్సిందే. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు సైతం సుమ డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. స్టార్ యాంకర్ గా గుర్తింపు పొందిన సుమ ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో చేసే సందడి అంతా కాదు.

నటుడిగా మంచి గుర్తింపు పొందిన బ్రహ్మాజీ కూడా సుమకి తోడుగా ఉన్నాడంటే ఆరోజు ఆ ఈవెంట్లో ఇద్దరూ కలిసి నవ్వులు పూస్తారు. గతంలో ఎన్నో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో వీరిద్దరు వారి ఏజ్ గురించి ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక సుమ అయితే బ్రహ్మాజీని బాల నటుడు, తాత అంకుల్ అంటూ రకరకాలుగా సంబోధిస్తూ ఉంటుంది. ఇక తాజాగా వీరిద్దరూ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన
‘కృష్ణ వ్రింద విహారి’ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేశారు.

బ్రహ్మాజీ కనిపించగానే సుమ రెట్టింపు ఉత్సాహంతో అతని మీద పంచులు వేస్తూ ఉంటుంది . ఇక ఈ ఈవెంట్ లో కూడా సుమా బ్రహ్మాజీ వద్దకు వెళ్లి ఏమైనా చెప్పండి అనగానే..మీరే ఏమైనా అడగండి అంటూ బదులిచ్చాడు .దీంతో మీ ఆస్తి వివరాలు చెప్పండి అని సుమ అనగానే.. మీ రాజీవ్ కంటే ఎక్కువ అంటూ లోలోపలే నసుగుతూ బదులిచ్చాడు. ఆ తర్వాత మీ ఏజ్‌ ఎంత అని సుమ వేసిన ప్రశ్నకు.. బ్రహ్మాజీ స్పందిస్తూ ..`యూ నాటీ..ఏ ఆంటీ` అంటూ అందరి ముందే సుమ పరువు తీశారు. దీంతో సుమ ముఖం వాడిపోయింది. ఇది ఎటు వెళుతుందో ఏమిటో.. నొ కామెంట్స్ చెప్పి రేపు షూటింగ్ ఎవరితో ఉంది కొంచం చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది. దీంతో
నెటిజన్స్ అనసూయని ఈ వివాదంలోకి లాగుతూ కామెంట్స్ చేస్తున్నారు.