దేశవ్యాప్తంగా నంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో కూడా ప్రసారమవుతు ఇప్పటికే ఐదు టెలివిజన్ సీజన్లతో పాటు ఒక నాన్ స్టాప్ ఓటిటి సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఇక ఇటీవల బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రారంభమై ఇప్పటికే 9 వారాలు పూర్తి చేసుకుంది. ఇక ప్రస్తుతం పదవ వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా ఉన్నవాళ్లు ఎలిమినేట్ అవుతున్నారు.
ఇక వారంలో మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. ఇక ఈ వారంలో కంటెస్టెంట్ల ఓటింగ్ విషయాలలో కూడా తారుమారు జరిగినట్లు సమాచారం. ఈ పదవ వారంలో టైటిల్ ఫేవరెట్ గా ఉంటూ మొదటి రెండు స్థానాల్లో నిలుస్తున్న రేవంత్, శ్రీహాన్ స్థానాలు కూడా తారుమారు అయినట్లు తెలుస్తోంది. అత్యధిక ఓటింగ్ తో ఎప్పుడు నంబర్ వన్ స్థానంలో నిలిచే రేవంత్ ని ఇనయ బీట్ చేసి నంబర్ వన్ గా నిలిచింది. ఇక దీంతో రేవంత్ ఈ పదవ వారంలో రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ప్రతివారం రెండవ స్థానంలో నిలుస్తున్న శ్రీహాన్ కూడా ఈ వారం మూడవ స్థానంలో నిలిచినట్లు సమాచారం.
ఇక తన ఆటతో అందరిని ఆకట్టుకుంటూ టాప్ 5 కంటెంట్ గా కొనసాగుతున్న ఫైమాకి కూడా ఈ వారం తక్కువ ఓటింగ్ నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ పదవ వారంలో ఆది రెడ్డి నాలుగో స్థానంలో, కీర్తి భట్ ఐదో స్థానంలో, ఫైమా ఆరో స్థానంలో కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక ఈవారంలో బాలాదిత్య , మెరీనా, వాసంతి డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. చివరి స్థానంలో ఉన్న ఈ ముగ్గురి కి ఫైమాకి మధ్య ఓటింగ్ లో ఎక్కువ తేడా లేకపోవటంతో ఈ సారి ఫైమ కూడా ఎలిమినేషన్ లో ఉండబోతోందని సమాచారం. ఇక గడిచిన రెండువారాలలో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడంతో ఈ వారం కూడా మరొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.