సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం భారీగా ఖర్చు చేసిన బిగ్ బాస్ రివ్యూవర్ ఆది రెడ్డి!

దేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొనటానికి ఎంతోమంది ఆసక్తి చూపుతుంటారు. ఈ షోలో అవకాశం కోసం మరి కొంత మంది బిగ్ బాస్ యాజమాన్యానికి డబ్బులు ఇచ్చి మరి షో కి వెళ్లినట్లు గతంలో వార్తలు వినిపించాయి. ఈ బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల పాపులర్ అవ్వటమే కాకుండా అధిక మొత్తంలో ఆదాయం కూడా పొందవచ్చు. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనటానికి అందరూ విశ్వప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే ఈ బిగ్ బాస్ షో కి వెళ్లే కంటెస్టెంట్స్ షో కి వెళ్ళే ముందు సోషల్ మీడియా టీమ్స్ పెట్టుకుంటుంటారు. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వటం కోసం ఈ టీమ్స్ కి లక్షల్లో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా గతంలో వచ్చిన ఎంతోమంది కంటెస్టెంట్లు బయట సోషల్ మీడియాలో టీమ్స్ పెట్టుకొని గెలిచారని విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూవర్ గా గుర్తింపు పొందిన ఆది రెడ్డి ఈసారి కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళాడు.

సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అయిన ఆదిరెడ్డి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు బయట సోషల్ మీడియా టీం ని ఏర్పాటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టీమ్స్ కోసం ఆదిరెడ్డి దాదాపు 5 నుండి 10 లక్షల వరకు ఖర్చు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎలిమినేషన్స్ నుండి బయటపడి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వటానికి ఆ మాత్రం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కామనర్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అయిన ఆదిరెడ్డి సెలబ్రిటీల కంటే ఎక్కువగా ఖర్చు చేయబట్టే, ప్రతి వారం, ప్రతిరోజూ అతని పేరు సోషల్ మీడియాలో మార్మగిపోతోందని సమాచారం.