Bigg Boss Ott Telugu: బిగ్‏బాస్ ఓటీటీ అతి త్వరలో షూరు.. కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా.!

Bigg Boss Ott Telugu: బుల్లితెరపై స్టార్ మాలో ప్రసారమైన అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోకు అన్ని భాషల్లో ఆదరణ బాగానే ఉంది. ఇప్పటివరకు తెలుగులో 5 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది.

అయితే ఇప్పటివరకు బుల్లితెరపై అలరించిన ఈ షో.. ఇక నుంచి డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ ప్రేక్షకులకు అసలైన ఎంటర్‏టైన్మెంట్ ఇవ్వడానికి తయారు అవుతుంది. సీజన్ 5 గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ నాగార్జున బిగ్‏బాస్ ఓటీటీకి గురించి ఒక హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరిలో బిగ్‏బాస్ ఓటీటీ రూపంలో అలరించడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని నాగార్జున ప్రకటించారు. దీంతో సీజన్ 6 రాబోతుందని అంతా అనుకున్నారు. కానీ ఓటీటీలో బిగ్‏బాస్ షో రాబోతుందని.. దానికి కూడా నాగార్జున హోస్ట్‏గా వ్యవహరించబోతున్నారని ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు నాగార్జున.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు బిగ్‏బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ లిస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. ఈ షోలో పాల్గోనబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ నెట్టింట్లో ఒకటే టాక్ నడుస్తోంది. అందులో బుల్లితెర యాంకర్ వర్షిణి, యూట్యూబ్ యాంకర్ శివ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు.. సాఫ్ట్ వేర్ డెవలపర్ ఫేమ్ వైష్ణవి చైతన్య, వరంగల్ వందన షార్ట్ ఫిలింస్‏తో పాపులరైన వందన, ఢీ 10 విజేత రాజు, టిక్ టాక్ స్టార్ దుర్గరావు కూడా పాల్గోననున్నట్లుగా సమాచారం.

ఇక ఓటీటీలో బిగ్‏బాస్ షో కేవలం ఓ గంట షో మాత్రమే కాకుండా 24 గంటలు లైవ్ రానున్నట్లుగా ఇప్పటికే నాగార్జున అనౌన్స్ చేశారు. అలాగే గత సీజన్ 5కు ఉపయోగించిన బిగ్‏బాస్ ఇంటినే కొన్ని మార్పులు చేర్పులు చేసి బిగ్‏బాస్ ఓటీటీకి వినియోగించబోతున్నారని సమాచారం. బిగ్‏బాస్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు బిగ్ బాస్ షో మేకర్స్.