నటనకు దూరంగా ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్..?

బుల్లితెర మీద ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో కి ప్రేక్షకులలో ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ప్రసారం అవుతున్న ఈ బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా ప్రసారమవుతు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అంతేకాకుండా ఇటీవల ఓటిటిలో కూడా నాన్ స్టాప్ సీజన్ ప్రసారమయ్యింది. ఇలా ఇన్ని సీజన్లు పూర్తయినా కూడా నెక్స్ట్ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ పూర్తి అయ్యి చాలా కాలమైనా కూడా ఇప్పటికీ సీజన్ 6 మొదలు కాలేదు.

ఈ బిగ్ బాస్ సీజన్ 6 కి సంబంధించిన వార్తలు తరచూ వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇప్పటికే ఈ సీజన్ 6 లో పాల్గొనే కొందరు కంటెస్టెంట్ల పేర్లు బయట వినిపిస్తున్నాయి. అయితే వారు మాత్రం బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనటం పై స్పందించటం లేదు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ మొదటవారంలో ప్రారంభం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్ల బిగ్ బాస్ కి సంబందించిన గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మునుపటి సీజన్లలో లేని విధంగా కొత్తగా బిగ్ బాస్ హౌజ్ ని రూపొందించారని సమాచారం.

ఇక తాజాగా బిగ్ బాస్ గురించి మరోక వార్త వైరల్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే ఒక కంటెస్టెంట్ పేరు బయటకు వచ్చింది. అతను ఎవరో కాదు చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు ఏర్పరచుకున్న మాస్టర్ భరత్. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో అనేక రకాల పాత్రలలో భరత్ నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న సమయంలో భారత్ చాలా బొద్దుగా ఉంటూ తను చేసే కామెడీ అందరినీ బాగా ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం భరత్ అడపా దడపా సినిమాలలో ప్రధాన పాత్రలలో మాత్రమే నటిస్తున్నాడు. చాలా కాలం క్రితం ‘ ABCD’ అనే సినిమాలో కీలక పాత్రలో నటించాడు. అయినా కూడా వెంటితెర పై ఎక్కువ కనిపించనప్పటికీ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొనే అవకాశం దక్కిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ ఇలా బంపర్ ఆఫర్ ఇవ్వటంతో భరత్ కూడా మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.