Bigg Boss 5 Telugu Winner VJ Sunny: బుల్లి తెరపై నెంబర్ వన్ గా దూసుకుపోయి విజయవంతంగా ప్రదర్శించబడిన తెలుగు టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ముగిసింది. కరోనా నేపథ్యంలో కూడా పదిహేను వారాలపాటు సజావుగా సాగిన ఈ బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం తో ముగిసింది. ఎన్నడూ లేని విధంగా మొత్తం 19 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి దర్శనమిచ్చారు. ఇంకో విషయం ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 5 లో ఒక్క వైల్డ్ ఎంట్రీ కూడా లేదు. వరుసగా బిగ్ బాస్ 3,4,5 సీజన్లని సజావుగా నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్ళాడు హోస్ట్ కింగ్ నాగార్జున.
బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు లో సెకండ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన వీజే సన్నీ.. ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ టైటిల్ ని సాధించాడు. ఇప్పుడు అతని వివరాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు వీజే సన్నీ బయో డేటా పైన ఒక లుక్కేద్దాం.
వీజే సన్నీ, మోడల్ గా తన కెరీర్ ని ఆరంభించాడు. ఆ తరువాత జర్నలిస్టుగా చేసాడు. దాని తరువాత వీజే గా చాలా ఏళ్ళు తన కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపించాడు. ఆ తరువాత యాంకర్ గా కూడా కొన్ని షోలను ముందుండి నడిపించాడు. ఇలా సంపాదించుకున్న ఫేమ్ తోనే సన్నీ సీరియల్స్ లో అడుగుపెట్టాడు. జీ తెలుగు లో ప్రసారమయిన కల్యాణ వైభోగమే సీరియల్ లో మంచి పాత్ర లభించడంతో వీజే సన్నీ కాస్త ఆర్టిస్ట్ సన్ని గా మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఇక సన్నీ కి లేడి ఫాన్స్ ఎక్కువ. అంతేకాకుండా సన్నీ ని అందరూ బుల్లితెర జూనియర్ యన్టీఆర్ అని ముద్దుగా పిలుచుకుంటారు. సీరియల్ లో నటించడమే కాకుండా ‘సకల గుణాభిరామా’ అనే సినిమాలో కూడా నటించాడు వీజే సన్నీ. పులిహోర రాజా సన్నీ కి అచ్చమయిన తెలుగు అమ్మాయి భార్యగా రావాలి అని కోరిక అయితే ఉందంట. మల్టి టాలెంటెడ్ అయిన సన్నీ బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ గెలుచుకుని తన అమ్మ కోరికని నెరవేర్చాడు.