వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సుమ.. మరీ అంత పిచ్చోళ్లలా కనిపిస్తున్నారా?

బిగ్ బాస్ షోను చూడటమే వేస్ట్ అని జనాలు అనుకుంటున్నారు. ఆడియెన్స్‌కు, ఆడియెన్స్ వేసే ఓట్లకు విలువే లేనప్పుడు ఎందుకు చూడటం అని బిగ్ బాస్‌ను ఏకిపారేస్తున్నారు. పైగా ఎలిమినేష్, డబుల్ ఎలిమినేషన్ అంటూ ఇదివరకే జనాలను ఎన్నో సార్లు బక్రాలను చేశాడు. ఎనిమిదో వారంలో అయితే ఏకంగా ఎలిమినేషన్‌నే ఎత్తేశాడు. నోయల్ రిక్వెస్ట్ చేయడంతో ఎలిమినేషన్ లేదని చెప్పాడు.

Bigg Boss 4 Telugu week 9 Trying To Fool People by Anchor Suma Wild Card Entry
Bigg Boss 4 Telugu week 9 Trying To Fool People by Anchor Suma Wild Card Entry

అది మరీ విడ్డూరంగా ఉంది. కొన్ని కోట్ల మంది కష్టపడి ఓట్లు వేస్తే నోయల్ చెప్పాడని ఎలిమినేష్ క్యాన్సిల్ చేశారట. ఇలా ప్రతీ సారి జనాలను పిచ్చోళ్లను చేస్తూనే ఉన్నారు. తాజాగా మళ్లీ బక్రాలను చేసేందుకు మరో ఎత్తులు వేశారు. యాంకర్ సుమను సండే ఎపిసోడ్ కోసం స్పెషల్ గెస్ట్‌గా పిలిచారు. కానీ అది చెప్పకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ డ్రామాలు ఆడారు. అందుకు తగ్గట్టే ఓ సూట్ కేసును పట్టుకొచ్చింది.

Bigg Boss 4 Telugu week 9 Trying To Fool People by Anchor Suma Wild Card Entry
Bigg Boss 4 Telugu week 9 Trying To Fool People by Anchor Suma Wild Card Entry

సుమ బిగ్ బాస్ షోలోకి రావడం.. ఇదే పెద్ద జోకు.. ఆమెకు అసలే క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటుంది అంటే.. మళ్లీ బిగ్ బాస్ లాంటి షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందా? ఇప్పుడు సుమకు ఉన్న క్రేజ్, పాపులారిటీయే ఎక్కువ. బిగ్ బాస్ షో కంటే వంద రెట్ల పాపులారిటీ ఉన్న సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఎవ్వరైనా నవ్వుతారు. అసలు విషయం ఏంటంటే.. ఈ రోజు ఎలిమినేట్ కాబోతోన్న అమ్మ రాజశేఖర్‌ను సాగనంపడానికి సుమను ప్రత్యేకంగా పిలిచినట్టు సమాచారం. మొత్తానికి నేడు సుమ మాత్రం దుమ్ములేపేట్టు కనిపిస్తోంది.