శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో పాట పాడిన భాను… ప్రేక్షకుల రియాక్షన్ ఏంటో తెలుసా…?

అదిరింది షో ద్వార యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయం అయిన భాను శ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అదిరింది షో తర్వాత యాంకర్ గా ఈ అమ్మడికి అవకాశాలు రాకపోవడంతో వెండితెర వైపు దృష్టి మల్లించింది. ఇలా అడపా దడపా సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంది. టీవి షో లలో అప్పుడప్పుడు గెస్ట్ గా కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే హాట్ ఫోటోలు నిమిషాలలో వైరల్ అవుతుంటాయి.

ఇదిలా ఉండగా అప్పుడప్పుడు ఈటీవీలో ప్రసారమవుతున్న టీవి షో లలో సందడి చేస్తున్న భాను ఈ వారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా పాల్గొని సందడి చేసింది. ఈ షో లో సుధీర్ రీ ఎంట్రీ ఇవ్వటంతో ఈ వారం షో చాలా సందడిగా ఉండబోతోంది. ఇక ఈ షో లో జబర్థస్త్ కమెడియన్లు తో పాటు సీరియల్ నటి నటులు కూడా పాల్గొని సందడి చేశారు. ఇక అందరూ ఆట పాటలతో ఫుల్ హంగామా చేశారు. ఇక ఈ వారం ప్రసారం కానున్న ఈ షో లో పాల్గొన్న భాను పాట పాడి అందరికీ షాక్ ఇచ్చింది.

ముందుగానే మొగ గొంతు ఉన్న భాను ఇలా పాట పడటంతో అందరూ షాక్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సినిమాలో హీట్ సాంగ్ అయిన “గెలుపు తలుపులే తీసే ఆకాశమే” అనే సూపర్ హిట్ పాటని భాను పాడటంతో ప్రేక్షకుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత అద్భుతమైన పాటను ఒరిజినల్ సింగర్స్ తో పాడించకుండ ఈమె తో పాడించారెంటి… మాకెందుకు ఈ ఖర్మ అంటూ.. నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.