బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య.. డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్?

నందమూరి బాలకృష్ణ ఎన్ని రోజులు కేవలం వెండితెర సినిమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసే వాళ్ళు.అయితే ప్రస్తుతం ఈయన తనలో మరో యాంగిల్ కూడా ఉందంటూ అన్ స్టాపబుల్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి బాలయ్య వ్యాఖ్యతగా వ్యవహరించడంతో ఆహా సబ్స్క్రైబర్స్ కూడా పెరిగిపోవడం విశేషం.అలా తన మాటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నటువంటి బాలకృష్ణ త్వరలోనే బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా హోస్టుగా వ్యవహరించాలని అభిమానులు ఆశపడుతున్నారు.

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం ఆరవ సీజన్ ప్రసారమవుతుంది మొదటి సీజన్ ఎన్టీఆర్ రెండవ సీజన్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన తదుపరి సీజన్లు మొత్తం నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆరవ సీజన్ ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ కార్యక్రమా రేటింగ్స్ పూర్తిగా పడిపోవడంతో తిరిగి ఏడవ సీజన్ కోసమైనా ఈ కార్యక్రమానికి హోస్ట్ గా బాలకృష్ణను వ్యవహరిస్తే ఈ కార్యక్రమం తిరిగి పూర్వ వైభవం సంపాదించుకుంటుందని భావిస్తున్నారు.

ఇప్పటికే బాలకృష్ణ తన మాటతీరుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ వంటీ కార్యక్రమానికి కూడా బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే ఈ కార్యక్రమం మరో లెవల్ లో ఉంటుందని పలువురు భావిస్తున్నారు.మరి బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి బాలయ్య విముఖత చూపిస్తారా నిజంగానే ఈ కార్యక్రమ రేటింగ్ కోసం నిర్వాహకులు కూడా బాలకృష్ణను సంప్రదిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది